అధ్యక్ష ఎన్నికల్లో గెలవబోతున్నాం : జో బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపు దాదాపు ఖరారైంది. హోరాహోరీగా జరిగిన పోరులో అనూహ్యంగా బైడెన్ దూసుకొచ్చారు. ప్రస్తుతం ట్రంప్‌కు 214 ఓట్లు రాగా, బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లతో ముందంజలో ఉన్నారు.

Update: 2020-11-07 09:15 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపు దాదాపు ఖరారైంది. హోరాహోరీగా జరిగిన పోరులో అనూహ్యంగా బైడెన్ దూసుకొచ్చారు. ప్రస్తుతం ట్రంప్‌కు 214 ఓట్లు రాగా, బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇక ఎన్నికల ఫలితాలపై జో బైడెన్ స్పందించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసం ఉందని, తుది ఫలితం వచ్చేవరకు ప్రతిఒక్కరూ సంయమనంతో ఉండాలని సూచించారు.

ప్రతి ఒక్కరి ఓటు లెక్కించడం జరుగుతుందన్న బైడెన్ ట్రంప్‌పై 40 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకోనున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు ‌తమ పార్టీకి సుమారు 7.5 కోట్ల ఓట్లు పోల‌య్యాయ‌ని, అయితే అమెరికా అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో ఏ అభ్య‌ర్థికి కూడా ఇన్ని ఓట్లు పోల‌వ్వ‌లేద‌ని బైడెన్ వెల్లడించారు..

అటు దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల పైన బైడెన్ స్పందించారు. దేశాధ్యక్షుడిగా భాద్యతలు చేప్పట్టినప్పటి నుంచే కరోనా నియంత్రణ కోసం క‌ఠిన‌మైన చర్యలు చేపడుతానని బైడెన్ చెప్పుకొచ్చారు.. వ‌రుస‌గా మూడ‌వ రోజు అమెరికాలో ల‌క్ష క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

Tags:    

Similar News