Usha Chilukuri: అమెరికా సెకండ్ లేడీగా తెలుగు మహిళ... ఈ విజయం తన భార్యకు అంకితం అంటున్న వైస్ ప్రెసిడెంట్ వాన్స్..

JD Vance: అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ విజయం సాధించింది. అయితే ఈ విజయం వెనక అనేక మంది కృషి ఉందని తన సభలో డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

Update: 2024-11-07 07:02 GMT

JD Vance, Usha Chilukuri

JD Vance: అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ విజయం సాధించింది. అయితే ఈ విజయం వెనక అనేక మంది కృషి ఉందని తన సభలో డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ముఖ్యంగా తనతో పాటు విజయం సాధించిన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వాన్స్. అలాగే ఆయన భార్య ఉషా చిలుకూరిని సైతం డోనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. దీంతో ప్రస్తుతం తెలుగు మూలాలు కలిగి ఉన్న ఉషా చిలుకూరి గురించి తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఈ ఉషా చిలుకూరి ఎవరు... అమెరికా ఉపాధ్యక్షుడు భార్యగా తొలి భారతీయ మూలాలు కలిగిన సెకండ్ లేడీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ గా పేరు తెచ్చుకున్న ఉషా చిలుకూరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో పూర్వీకుల మూాలాలు కలిగి ఉన్న ఉషా చిలుకూరి కుటుంబం చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడింది.

ఆమె తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి అమెరికాలో స్థిరపడగా వారికి ఉష అక్కడే జన్మించింది. ఈ విధంగా తెలుగు మూలాలు ఆమెలో ఉన్నాయి. ఉష బాల్యం అంతా శాన్ డియాగోలో గడిచింది. యేల్ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు, ఆమె కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని కూడా కలిగి ఉంది. యేల్ యూనివర్సిటీలోనే ఆమెకు జేడీ వ్యాన్స్ పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త వివాహం వరకు దారితీసింది. జెడి వాన్స్ ఆ తర్వాత రాజకీయంగా ఎదగడం ప్రారంభించారు. రిపబ్లికన్ పార్టీలో ఎదుగుతూ వచ్చిన జెడి వాన్స్ ఆ తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు స్థాయి వరకు ఎదిగారు. ప్రస్తుత ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా గెలిచిన జేడీ వాన్స్ తన భార్య ఉషకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తన విజయం వెనుక ఆమె కృషి చాలా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ముఖ్యంగా ప్రవాస భారతీయుల ఓట్లను ఆకర్షించడంలో ఉష చాలా సహకరించిందని, జెడి వాన్స్ పేర్కొనడం విశేషం. ఇదిలా ఉంటే అమెరికా ఉపాధ్యక్షుడు భార్య హోదాలో సెకండ్ లేడీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ గా ఉషా చిలుకూరికి హోదా దక్కడం పట్ల ఆమె బంధువులు ఎక్కువ మొత్తంలో నివసిస్తున్న తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలంలో పండగ వాతావరణం నెలకొని ఉంది. ఆమె బంధువులు రిపబ్లికన్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. జెడి వాన్స్ ఉపాధ్యక్షుడు అవడం తమకు ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు.

Tags:    

Similar News