Iran-Israel: ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు..స్వయంగా పర్యవేక్షించిన నెతన్యాహు
Iran-Israel: ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇరాన్ అక్టోబర్ 1న ఇజ్రాయెల్ పై దాదాపు 180 క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్ కు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఇజ్రాయోల్ ఇప్పుడు ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ప్రతికార దాడులు చేస్తోంది.
Iran-Israel: ఇరాన్-ఇజ్రాయెల్ ఇప్పట్లో శాంతించేలా కనిపించడం లేదు. ఇరాన్ పై ప్రతికార దాడులకు పాల్పడుతోంది ఇజ్రాయోల్. దాదాపు 25 రోజుల తర్వాత ఇరాన్ పై భారీ దాడితో ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. ఇరాన్‌లోని పలు నగరాల్లో పేలుళ్లు సంభవించాయి. అయితే, ఆయిల్ ప్లాంట్లు లేదా అణు కేంద్రాలపై దాడులు జరగలేదని ఇరాన్ మీడియా పేర్కొంది.
సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడినట్లు తెలిపింది. అక్టోబర్ 1న ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాదాపు 180 క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడికి ఇరాన్ మూల్యం చెల్లించవలసి ఉంటుందని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. అన్నట్లుగానే ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ పై ప్రతీకార దాడులకు పాల్పడుతోంది.
ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు ఆత్మరక్షణ కోసం నిర్వహించినట్లు US వైట్ హౌస్ పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో, టెహ్రాన్ ఇరాన్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడిని ప్రారంభించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడి చేసింది.
ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి సీన్ సెవెట్ మాట్లాడుతూ ...సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ఈ దాడులు ఆత్మరక్షణ కోసమని.. అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగా ఈ దాడులు జరిగినట్లు తెలిపారు.
ఇరాన్‌లోని పలు నగరాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. టెహ్రాన్‌తో సహా ఇరాన్‌లోని ఇతర నగరాల్లోని సైనిక స్థావరాలపై ఈ దాడి జరిగింది. ఇరాన్ మీడియా దాడిని ధృవీకరించింది. దాడిలో అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోలేదని చెప్పారు. సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు వినిపించాయి. ఇజ్రాయెల్ అనేక లక్ష్యాలపై ఏకకాలంలో దాడి చేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడిని ధృవీకరించింది.