Israel Gaza War : గాజాపై విరుచుకుపడ్డా ఇజ్రాయెల్...164 మంది దుర్మరణం

Update: 2024-10-30 02:08 GMT

Israel Gaza War : పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్ -హమాస్ లమధ్య యుద్థం తారాస్థాయికి చేరుకుంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఇజ్రాయెల్ దళాలు గాజాపై విరుచుకుపడ్డాయి. ఉత్తర గాజాలో బీట్ లాహియాలో ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో 55మంది పాలస్తీయన్లు మరణించినట్లు పాలస్తీనా సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వెల్లడించింది. శిథిలాల కింద చిక్కుకుని చాలా మంది గాయపడ్డారని పేర్కొంది.

మరణించినవారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని పాలస్తీనా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ దాడిపై ఇంతవరకు ఇజ్రాయెల్ స్పందించలేదు. ఇజ్రాయెల్ దాడులతో సుమారు లక్ష మంది పాలస్తీనియన్లు సరైన ఆహారం, వైద్య సదుపాయాలు లేక అలమటిస్తున్నారని పాలస్తీయన్ సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది. గాజాలోని ఆసుపత్రుల్లో వైద్య సామగ్రి, మానవ వనరుల కొరత అధికంగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.

అటు గాజా ఉత్తర ప్రాంతంలో శరణార్థులు ఆశ్రయం పొందుతున్న ఐదు అంతస్తుల భవనంపై మంగళవారం ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 109 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర గాజాలో మంగళవారం నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ఈ దాడులపై కౌన్సిల్ ఆఫ్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ స్పందించింది.

ఈ రెండు దేశాల మధ్య నెలకున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం వస్తుందోనని ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు గాజా పౌరులు. అమెరికా విదేశాంగశాఖ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ చొరవత ఇరువర్గాలు సంధి ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నంలో ఉన్నాయి. గాజాలో కాల్పుల విరమణ ఒప్పంద చర్చల్లో తమ నిఘా అధిపతి పాల్గొంటున్నారని ఈమధ్యే ఇజ్రాయెల్ తెలిపింది. ఒప్పందం కుదిరితే పోరాటం ఆపివేస్తామంటూ హమాస్ వర్గాలు కూడా వెల్లడించాయి. 

Tags:    

Similar News