Israel Attacks: ఇజ్రాయెల్ మరో ప్రత్యర్థిని చంపేసింది..40 కోట్ల రివార్డు ఉన్న ఫౌద్ షుకర్ ఎవరో తెలుసా?

Israel Attacks: ఇజ్రాయెల్ తన ఇద్దరు ప్రత్యర్థులను వరసబెట్టి హతమార్చింది. ఒకవైపు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ చంపేసింది. మరోవైపు, రూ. 40 కోట్ల రివార్డు ప్రకటించిన హిజ్బుల్లా కమాండర్ ఫౌద్ షుకర్ కూడా హతమయ్యాడు. ఎవరీ ఫౌద్ షుగర్..అతనిపై రూ. 40కోట్ల రివార్డు ఎందుకు ప్రకటించారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Update: 2024-07-31 06:46 GMT

Israeli Attacks : ఇజ్రాయెల్ మరో ప్రత్యర్థి చంపేసింది..40 కోట్ల రివార్డు ఉన్న ఫౌద్ షుకర్ ఎవరో తెలుసా?

Israel Attacks: ఇజ్రాయెల్ తన ప్రతీకారం తీర్చుకుంటోంది. తమ దేశ పౌరులను చిత్ర హింసలు పెట్టి..వందలాంది మరణానికి కారణమైన ప్రత్యర్థి ఒక్కొక్కొరుగా అంతమొందిస్తోంది. తాజాగా హమాస్ చీఫ్..ఇస్మాయిల్ హనియాతో పాటు హిజ్బుల్లా కమాండర్ ఫౌద్ షుకర్ ను మట్టుబెట్టింది. హిజ్బుల్లా, హమాస్ ఈ రెండింటిని ఇజ్రాయెల్‌ను మ్యాప్ నుండి చెరిపివేయాలని డిసైడ్ అయ్యింది. అన్నట్లుగానే ప్రతికారచర్యలకు పూనుకుంది. తన లక్ష్యాన్ని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటోంది.

ఇజ్రాయెల్‌పై అనేక పెద్ద దాడులకు పాల్పడిన ఫౌద్ షుగర్ కోసం చాలా కాలంగా ఇజ్రాయెల్, అమెరికాలు సెర్చ్ చేస్తున్నాయి .ఫౌద్ షుగర్ కోసం అన్వేషణ గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఫౌదర్ షుగర్ హిజ్బుల్లా కోసం వ్యూహాలను రూపొందిస్తూ వాటిని అమలు చేయడలో కీలకంగా వ్యవహారించేవాడు.దీంతో అమెరికా, ఇజ్రాయెల్ ఫుద్ షుకర్ పై రూ.40 కోట్ల రివార్డు ప్రకటించారు. అంటే ఈ రివార్డ్ మొత్తాన్ని బట్టి హింజ్బుల్లా కమాండర్ స్థాయిని మనం అంచనా వేసుకోవచ్చు. ఫౌద్ చేసిన అరాచకాలు, దురాగతాలు, వందలాది మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఫౌద్ ఎలాగైన అంతమొందించాలని ఇజ్రాయెల్ కంకణం కట్టుకుంది. అన్నట్లుగానే ఫౌద్ ను మట్టుబెట్టింది.

ఫౌద్ షుకర్ ఎవరు?

న్యూయార్క్ టైమ్స్ వార్తల ప్రకారం, లెబనీస్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు చెందిన సీనియర్ కమాండర్,బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడికి గురి అయిన ఫౌద్ షుకర్ ఉగ్రవాద సంస్థ అధిపతికి సన్నిహిత సలహాదారుగా ఉండేవాడు. 1983 బీరూట్ బాంబు దాడి తర్వాత అమెరికా ప్రభుత్వం ఫౌద్ షుకర్ కోసం తీవ్రంగా గాలిస్తోంది. బీరుట్‌లో జరిగిన ఈ దాడిలో 300 మంది అమెరికన్, ఫ్రెంచ్ సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే, ఫౌద్ షుకర్ ఇజ్రాయెల్ దాడిలో మరణించాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇజ్రాయెల్‌లోని గోలన్ హైట్స్ ప్రాంతంలో ఫుట్‌బాల్ గ్రౌండ్‌పై దాడి చేసినట్లు ఫౌద్ షుకర్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో 12 మంది చిన్నారులు చనిపోయారు. దీని తరువాత ఇజ్రాయెల్ ఫౌద్ షుకర్‌ను చంపాలని డిసైడ్ అయ్యింది.

అనేక దాడులకు సూత్రధారి:

ఫౌద్ షుకర్‌ను చంపడానికి, ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరూట్‌పై అనేక వైమానిక దాడులు చేసింది. ఫౌద్ షుకర్ హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లాకు సన్నిహితుడు. అంతేకాదు నమ్మిన బంటు కూడా. 2016లో సిరియాలో సీనియర్ హిజ్బుల్లా కమాండర్ హత్యకు గురయ్యాడు. దీని తర్వాత ఫౌద్ షుకర్ అతని స్థానంలోకి వచ్చాడు. 1983లో బీరుట్‌లోని ఒక బ్యారక్‌పై దాడి జరిగింది. ఈ దాడి జరిగిన చోట ఫ్రెంచ్, అమెరికా సైనికులు మోహరించారు. మొత్తానికి ఫౌద్ షుగర్ తోపాటు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను హతమార్చి తమ పగను తీర్చుకున్నాయి అమెరికా, ఇజ్రాయెల్ 

Tags:    

Similar News