హెజ్బొల్లా సీక్రెట్ బంకర్‌లో కట్టలు కట్టల నగదు, బంగారం

Secret Bunker: లెబనాన్ రాజధాని బేరూట్‌లో హెజ్బొల్లా మిలిటెంట్లకు చెందిన ఓ సీక్రెట్ బంకర్లలో లక్షల కొద్దీ డాలర్ల నగదు, భారీ యెత్తున బంగారం బయటపడిందని ఇజ్రాయెల్ ప్రకటించింది.

Update: 2024-10-22 08:35 GMT

హెజ్బొల్లా సీక్రెట్ బంకర్‌లో కట్టలు కట్టల నగదు, బంగారం

Secret Bunker: లెబనాన్ రాజధాని బేరూట్‌లో హెజ్బొల్లా మిలిటెంట్లకు చెందిన ఓ సీక్రెట్ బంకర్లలో లక్షల కొద్దీ డాలర్ల నగదు, భారీ యెత్తున బంగారం బయటపడిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. అల్ సాహెల్ ఆస్పత్రి కింద నిర్మించిన ఈ రహస్య స్థావరంలో హెజ్బొల్లా మిలిటెంట్లు దాచిన డబ్బు బంగారం నిల్వలు భారీయెత్తున ఉన్నాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి డేనియల్ హగారీ తెలిపారు. ఆయన టీవీలో అధికారిక ప్రకటన చేస్తూ ఇజ్రాయెల్ పై దాడి చేయడానికే మిలిటెంట్లు ఈ నిధులను ఖర్చు చేస్తున్నారని అన్నారు.

ఈ బంకర్ లో 500 మిలియన్ డాలర్ల నగదు ఉందని ఇజ్రాయెల్ ప్రకటించింది. భారత కరెన్సీలో చెప్పాలంటే దీని విలువ 4,200 కోట్ల కంటే ఎక్కువే. బంగారం కూడా గుట్టలుగా ఉందని ఆయన చెప్పారు. షియా అమల్ మూవ్ మెంట్ పార్టీకి చెందిన లెబనాన్ శాసనసభ్యుడు ఆల్ -సహెల్ ఆసుపత్రి డైరెక్టర్ ఇజ్రాయెల్ వాదనను తోసిపుచ్చారు.

బంకర్ ఎందుకు నిర్మించారు?

హెజ్ బొల్లా కు చెందిన సయ్యద్ హసన్ నస్రల్లా కోసం ఈ బంకర్ ను నిర్మించారు. ఎమర్జెన్సీ సమయంలో నస్రల్లా ఈ బంకర్ ను ఉపయోగించేవారని ఇజ్రాయెల్ అనుమానిస్తుంది. ఈ బంకర్ ఉన్న ప్రాంతానికి చెందిన మ్యాప్ ను ఇజ్రాయెల్ సైన్యం చూపింది. ఈ ప్రాంతంపై ఫోకస్ పెట్టామని కూడా తెలిపింది. తమ యుద్ధం హెజ్ బొల్లాతోనేని లెబనాన్ పౌరులతో కాదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. బంకర్ ఉన్న ప్రాంతంలోని ఆసుపత్రిపై తాము దాడి చేయబోమని ఐడీఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన నేపథ్యంలో ఈ ఆసుపత్రిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సూచన

హెజ్ బొల్లా ఉగ్ర కార్యకలాపాలకు ఆర్ధికంగా అండగా ఉండే ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రజలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడీఎఫ్ సూచించింది. లెబనాన్ లోని ఆల్ ఖర్ద్ అల్ హసన్ ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. ఆల్ ఖర్ద్ హసన్ అనేది లైసెన్స్ లేని గ్రే మార్కెట్ బ్యాంక్. హెజ్ బొల్లాకు నిధులు సమకూర్చే ప్రధాన ఆర్ధిక వనరుగా పనిచేస్తోంది.లెబనాన్ వ్యాప్తంగా ఈ సంస్థకు 30 బ్రాంచీలున్నాయి. ఇవన్నీ బీరుట్ లోని అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లోనే ఉన్నాయి.

హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ ఈ నెల 7న ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. సిన్వార్ హత్యను ఇజ్రాయెల్ ధృవీకరించింది. సిన్వార్ మరణం తర్వాత హమాస్ లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దళాలు మరింత దూకుడును పెంచాయి. ఆయా సంస్థల ఆర్ధిక మూలాలను దెబ్బతీసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి.


Tags:    

Similar News