యుగాంతం వచేస్తోందా..? అక్కడ రక్తపు రంగులో వరద దేనికి సంకేతం

ఇండోనేషియాలో రక్తపు రంగులో వరద పారింది.

Update: 2021-02-06 16:34 GMT

యుగాంతం వచేస్తోందా..? 

ఇండోనేషియాలో రక్తపు రంగులో వరద పారింది. మీరు విన్నది నిజమే.. ఇండోనేషియా సెంట్రల్ జావాలోని పెకలోంగన్ గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. జెంగ్‌గోట్‌లో కురిసిన భారీ వర్షాలకు వరదలు సంభవించాయి. దీంతో సమీపంలోని బాతిక్ కర్మాగారంలోని రంగులు వరద నీటిలో కలిసి పోయాయి. ఫలితంగా రక్తాన్ని పోలిన ముదురు ఎరుపు రంగు వరద నీటిలో కలిసిపోయి గ్రామాన్ని చుట్టుముట్టింది. ఇంకేముంది సోషల్ మీడియాలో యుగాంతం వార్త వైరల్ అయిపోయింది. నెత్తుటి వర్షం.. యుగాంతం అంటూ నెటిజన్లు షేర్లు మీద షేర్లు చేసేశారు.

అసలు విషయానికి వస్తే.. ఇండోనేషియాలోని పెకలోంగన్ సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసే రంగులకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా బాతిక్ ఫాబ్రిక్ అనే పెయింట్‌ తయారీకి పెట్టింది పేరు. దీంతో వరద నీరు పెయింట్ తయారీ ఫ్యాక్టరీలోకి చేరడంతోనే రంగు మారిందని అధికారులు స్పష్టం చేశారు. ఎర్రరంగు వరద బాతిక్ డై కారణంగా వచ్చిందని, ఆందోళన అవసరం లేదని అధికారులు తెలిపారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం అనవసరపు ఊహాగానాలతో ఇంకా రక్తపుటేరులు పారుతూనే ఉన్నాయి.


Tags:    

Similar News