Indonesia: మారనున్న ఇండోనేషియా రాజధాని
Indonesia: ఇండోనేషియా రాజధాని ఏదంటే టక్కున చెప్పే సమాధానం జకార్తా అయితే...
Indonesia: ఇండోనేషియా రాజధాని ఏదంటే టక్కున చెప్పే సమాధానం జకార్తా అయితే ఇక నుంచి ఆ దేశ రాజధాని జకార్తా కాదు దానికి రెండు వేల కిలోమీటర్ల దూరంలోని బోర్నియో ద్వీపంలోని తూర్పు కాలిమాంటన్ ప్రాంతమే కొత్త రాజధాని. ఆమేరకు రాజధాని మార్పు బిల్లును ఇండోనేషియా పార్లమెంట్ అమోదించింది.
రాజధానిగా మారబోతున్న కాలిమాంటన్ ప్రాంతానికి నుసంతారా అని ఇండోనేషియా ప్రభుత్వం నామకరణం చేసింది. నుసాంతారా అంటే ద్వీప సమూహమని అర్థం. ఇది జావా ద్వీపంలోని ప్రస్తుత రాజధాని జకార్తాకు 2వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొత్త రాజధాని నుంచి పరిపాలన ప్రారంభించినా జకార్తా నగరం ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా ఉంటుందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
అగ్నేయాసియా దేశాల్లో ఉన్న అతి పెద్ద ద్వీపాల్లో బోర్నియో ఒకటి. ఈ భూభాగాన్ని ఇండోనేషియా, మలేషియా, బ్రూనే దేశాలు పంచుకున్నాయి. ఇండోనేషియా వాటాగా వచ్చిన తూర్పు కాలిమాంటన్ భూభాగంలోనే కొత్త రాజధాని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. 2024 ప్రారంభం నుంచి రాజధాని తరలింపును ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.