భారత్, తాలిబన్ల మధ్య తొలిసారి చర్చలు.. ఆప్ఘన్ గడ్డపై ఉగ్రవాదాన్ని సహించేది లేదన్న భారత్

Doha: ఆప్ఘనిస్థాన్ గడ్డపై ఉగ్రవాదం పెచ్చరిల్లితే భారత్ ఇక ఎంత మాత్రమూ ఊరుకునేది లేదని భారత దేశం తాలిబన్లకు వార్నింగ్ ఇచ్చింది.

Update: 2021-08-31 14:30 GMT

భారత్, తాలిబన్ల మధ్య తొలిసారి చర్చలు..

Doha: ఆప్ఘనిస్థాన్ గడ్డపై ఉగ్రవాదం పెచ్చరిల్లితే భారత్ ఇక ఎంత మాత్రమూ ఊరుకునేది లేదని భారత దేశం తాలిబన్లకు వార్నింగ్ ఇచ్చింది. తాలిబన్ల కోరిక మేరకు సౌదీలోని దోహాలో తాలిబన్లు, భారత ప్రతినిధుల మధ్య తొలిసారిగా చర్చలు జరిగాయి. ఈ చర్చలకు ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం అధికారి దీపక్ మిట్టల్ హాజరయ్యారు. ఆప్ఘనిస్తాన్ లో మిగిలిన భారతీయులను వేగంగా, సురక్షితంగా వెనక్కు తీసుకొచ్చే అంశంపై భారత్ తాలిబన్లతో చర్చలు జరిపింది.

అయితే ఈ చర్చలు పూర్తిగా తాలిబన్ల విన్నపం మేరకే జరిగాయని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా తమ ప్రవర్తనతో చెడ్డ పేరుతెచ్చుకున్న తాలిబన్లు భారత్ లాంటి ప్రజాస్వామిక దేశం గుర్తింపు కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. మరోవైపు తాలిబన్లతో భారత్ చర్చలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విచిత్రమైన కామెంట్ చేశారు. భారత్ తాలిబన్లతో చర్చించడం అంటే తాలిబన్లను భారత్ గుర్తించినట్లేనా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News