పాకిస్తాన్‌లో అర్ధరాత్రి వరకు కొనసాగిన హైడ్రామా.. ఓడిన ఇమ్రాన్ ఖాన్...
Pakistan - Political Crisis: అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన ఇమ్రాన్‌ఖాన్...
Pakistan - Political Crisis: పాకిస్తాన్‌లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అర్ధరాత్రి పార్లమెంట్ లో జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్‌ఖాన్ సర్కార్ క్లీన్ బౌల్డ్ అయ్యింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేశారు. ఇమ్రాన్‌ఖాన్ వర్గం సభ నుంచి వాకౌంట్ చేసింది. ప్రభుత్వానికి సంబంధం లేకుండానే అవిశ్వాస తీర్మాణానికి ఓటింగ్ జరిగింది. సభలో ఇమ్రాన్‌ఖాన్ వర్గం లేకుండా పోవడంతో ఓటింగ్ ఏకపక్షమైంది.
దీంతో ఇమ్రాన్‌ఖాన్ కు బలం లేకుండా పోయింది. పాక్ జాతీయ అసెంబ్లీలో 174 మంది సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఓడిపోవడంతో అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. ఇక రేపు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేనున్నారు. ఇమ్రాన్ సర్కారుపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై అర్ధరాత్రి 12 గంటలకు జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది.
అర్ధరాత్రి పూట పాక్ జాతీయ అసెంబ్లీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు భారీగా చేరుకున్నారు. ఇమ్రాన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. పాక్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై భద్రతను కట్టదిట్టం చేశారు. ఇస్లామాబాద్‌లో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. టోల్ ప్లాజాల వద్ద కూడా బలగాలు మోహరించాయి. అసెంబ్లీలో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇమ్రాన్‌ఖాన్ దేశం విడిచి వెళ్లకుండా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది.