America: అమెరికాలో మళ్లీ హెచ్1బీ వీసా జారీ ప్రక్రియ

America: లాటరీ పద్ధతిలో వీసాలకు ఎంపిక

Update: 2022-01-30 12:30 GMT

అమెరికాలో మళ్లీ హెచ్1బీ వీసా జారీ ప్రక్రియ

America: 2023 ఆర్థిక సంవత్సరం కోసం హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల నిపుణులు అమెరికాలో ఉపాధి పొందాలంటే హెచ్1బీ వీసా తప్పనిసరి. ప్రతి ఏడాది 65 వేల హెచ్1బీ వీసాలను అమెరికా జారీ చేస్తుంటుంది. తాజాగా మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ఇమ్మిగ్రేషన్ విభాగం తెలిపింది.

ఆన్‌లైన్‌ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించింది. రిజిస్ట్రేషన్ దరఖాస్తు సమయంలో 10 డాలర్ల రుసుం చెల్లించాలి. రిజిస్ట్రేషన్లకు మార్చి 18 ఆఖరు తేదీ. గడువులోపల దరఖాస్తు చేసుకున్నవారికి ర్యాండమ్ పద్ధతిలో హెచ్1బీ వీసాలు కేటాయిస్తారు. ఈ విడతలో వీసాలు పొందేవారు అక్టోబరు నుంచి అమెరికాలో ఉద్యోగంలో చేరే వెసులుబాటు ఉంటుంది.

Tags:    

Similar News