Donald Trump: డొనాల్డ్ ట్రంప్‎పై దాడికి యత్నం..నేను క్షేమం..నన్నెవరూ ఆపలేరు

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి దాడికి ప్రయత్నం జరిగింది. ట్రంప్ నకు సమీపంలో కాల్పులు జరిగినట్లు సమాచారం. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో తన గోల్ఫ్ కోర్టులో గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి తుపాకీతో అనుమానాస్పదంగా సంచరించాడు.

Update: 2024-09-16 02:28 GMT

 Donald Trump: డొనాల్డ్ ట్రంప్‎పై దాడికి యత్నం..నేను క్షేమం..నన్నెవరూ ఆపలేరు

Donald Trump: మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఓటింగ్ జరగనుంది. అయితే ఇదిలా ఉంటే మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి కాల్పులు జరిగే ప్రయత్నం జరిగింది. అమెరికా ఇంటెలిజెన్స్ సర్వీస్ దీనిపై విచారణ జరుపుతోందని తెలిపింది. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో తన గోల్ఫ్ కోర్టులో గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి తుపాకీతో అనుమానాస్పదంగా సంచరించాడు. అయితే మాజీ అధ్యక్షుడు పూర్తిగా క్షేమంగా ఉన్నారని డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం, నిఘా విభాగం తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిగాయా లేదా అన్నది ప్రస్తుతానికి తేలలేదు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదు.

డొనాల్డ్ ట్రంప్ తరచుగా ఉదయం గోల్ఫ్ ఆడుతూ వెస్ట్ పామ్ బీచ్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో భోజనం చేస్తారు. ట్రంప్ వెస్ట్ పామ్ బీచ్ గోల్ఫ్ కోర్స్ దగ్గర కాల్పులు జరిగాయా లేక మైదానంలో కాల్పులు జరిగాయా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ట్రంప్ దగ్గర జరిగిన దాడిపై డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ స్పందించిన తీరు కూడా వెలుగులోకి వచ్చింది. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌, ఫ్లోరిడాలోని ఆయన పై కాల్పులు జరిగినట్లు వచ్చిన నివేదికల గురించి తనకు వివరించినట్లు కమల తెలిపారు. తాను క్షేమంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. అమెరికాలో హింసకు తావు లేదు. అదే సమయంలో, డొనాల్డ్ ట్రంప్ క్షేమంగా ఉన్నారని తెలియడంతో తాము ఊపిరిపీల్చుకున్నామని పొందామని వైట్ హౌస్ తెలిపింది.

అంతకుముందు జూలై 13న అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని సాయుధుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో, ట్రంప్ కుడి చెవిలో బుల్లెట్ తప్పిపోయింది. ర్యాలీకి హాజరైన ఒకరు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ట్రంప్ స్పందన:

ఈ కాల్పులపై ట్రంప్ స్పందించారు. తనకు సమీపంలోనే కాల్పులు చోటుచేసుకోవడంపై తన అభిమానులను ఉద్దేశించి మెయిల్ చేశారు. నాకు సమీపంలో కాల్పులు జరిగాయి. పరిస్థితి అదుపులోనే ఉంది. మీ అందరికీ ఓ విషయం చెబుతున్నాను..నేను బాగున్నాను...సురక్షితంగా ఉన్నాను. ఏదీ కూడా నన్ను అడ్డుకోలేదు. ఎప్పటికీ నేను లొంగేదే లేదు అంటూ ట్రంప్ వెల్లడించారు. 

Tags:    

Similar News