భూమ్మీద ఈ ప్రదేశంలో గురుత్వాకర్షణ శక్తి పనిచేయదు.. ఎందుకంటే..?
Hoover Dam: ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. అవి తెలిసినప్పడు అందరు ఆశ్చర్యపోతారు...
Hoover Dam: ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. అవి తెలిసినప్పడు అందరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అవి నమ్మలేని విధంగా ఉంటాయి. అలాంటి కోవకే చెందుతుంది ఈ విషయం కూడా. సాధారణంగా ఈ భూమిపై గురుత్వాకర్షణ శక్తిలేని ప్రదేశాలు ఉండవని అంటారు. కానీ ఒక ప్రదేశంలో గురుత్వాకర్షణ శక్తి పనిచేయడం లేదు. ఆ ప్రదేశం పేరు హూవర్ డ్యామ్ ఆఫ్ అమెరికా. ఇది ఒక ఆనకట్ట. ఇక్కడి నుంచి ఏది విసిరినా అది గాలిలో తేలియాడుతుంది.
ఈ ఆనకట్ట అమెరికాలోని నెవాడా, అరిజోనా రాష్ట్ర సరిహద్దులో నిర్మించారు. వాస్తవానికి హూవర్ డ్యామ్ దగ్గర వస్తువులు గాలిలో ఎగురుతాయి. వాటిపై గురుత్వాకర్షణ ప్రభావం ఉండదు. హూవర్ డ్యామ్ నుంచి ఏదైనా పైకి విసిరితే అది నేలపై పడకుండా గాలిలో ఎగురుతూ ఉంటుంది. ఈ ఆనకట్ట విల్లు ఆకారంలో నిర్మించారు. పైన పేర్కొన్న విధంగా ఏదైనా వస్తువును ఇక్కడ విసిరినప్పుడు అది డ్యామ్ గోడను తాకి గాలిలో ఎగరడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా ఈ దృశ్యం ఒక అద్భుతం లేదా సైన్స్ ఫిక్షన్ చిత్రంలా అనిపిస్తుంది.
హూవర్ డ్యామ్ ఎత్తు 726 అడుగులు. హూవర్ డ్యామ్ బేస్ మందం 660 అడుగులు. ఇది రెండు ఫుట్‌బాల్ మైదానాలకు సమానం. ఇప్పటి వరకు ఈ ఆనకట్టని నిర్మించి 90 సంవత్సరాలు గడుస్తున్నాయి. అయినా ఇది చెక్కుచెదరలేదు. అమెరికాలో అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రాలలో ఇది ఒకటి. దీని నిర్మాణం కోసం వేలాది మంది కార్మికులు పనిచేశారు.
అందులో దాదాపు వంద మంది కార్మికులు నిర్మాణ సమయంలో మరణించారు. ఈ డ్యామ్‌ను అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ సెప్టెంబర్ 30, 1935న జాతికి అంకితం చేశారు. దీనికి యునైటెడ్ స్టేట్స్ 31వ అధ్యక్షుడు హెర్బర్ట్ హూవర్ పేరు పెట్టారు.