Google Extends Work From Home: గూగుల్ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. వర్క్ ఫ్రం హోం పొడ‌గింపు

Google Extends Work From Home: ప్రపంచ దేశాలను క‌రోనా వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ క్ర‌మంలో చాలా ఐటీ కంపెనీలతో పాటు వివిధ రంగాల్లోని ఉద్యోగులు... వర్క్ ఫ్రం హోం వెసులుబాటును పొందిన విషయం తెలిసిందే

Update: 2020-07-28 15:00 GMT
google work from home

Google Extends Work From Home: ప్రపంచ దేశాలను క‌రోనా వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ క్ర‌మంలో చాలా ఐటీ కంపెనీలతో పాటు వివిధ రంగాల్లోని ఉద్యోగులు... వర్క్ ఫ్రం హోం వెసులుబాటును పొందిన విషయం తెలిసిందే. తాజాగా సాఫ్టవేర్‌ దిగ్గజం గూగుల్... తన ఉద్యోగులకు శుభ‌వార్త తెలియ‌జేసింది. తన ఉద్యోగుల‌కు 'వర్క్ ఫ్రం హోం' సౌకర్యాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు పొడిగించింది. వ‌చ్చే ఏడాది జూన్ 30 వరకు వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణ‌యంతో దాదాపు రెండు లక్షలమంది ఉద్యోగులకు ఊరట కలగనుంది. సంస్థ నిర్ణయాన్ని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్... ఉద్యోగులకు మెయిల్ ద్వారా తెలిపారు. కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా, ఇంటి నుండి పని చేసే వెసులుబాటును వచ్చే జూన్ 30 వ వరకు పొడిగిస్తున్నట్లు ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకోవడంతో మిగతా కంపెనీలు కూడా ఆ దిశగా ఆలోచించే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రబలినప్పటి నుంచి దాదాపు అన్ని ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని కంపెనీలు పూర్తిగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇస్తున్నట్టు చెబుతున్నాయి. 

Tags:    

Similar News