AI: మానవ మేధపై ఆందోళన.. గూగుల్‌కు 'గాడ్‌ఫాదర్‌ ఆఫ్‌ ఏఐ' రాజీనామా!

Geoffrey Hinton: భూమిపై ఆధిపత్యం వహిస్తున్న మనిషి మేధకు .. అతి త్వరలో పెను సవాల్‌ ఎదురుకాబోతుంది

Update: 2023-05-03 04:07 GMT

AI: మానవ మేధపై ఆందోళన.. గూగుల్‌కు ‘గాడ్‌ఫాదర్‌ ఆఫ్‌ ఏఐ’ రాజీనామా! 

Geoffrey Hinton: ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో వేగంగా దూసుకెళ్లాలని ప్లాన్‌ చేస్తున్న గూగుల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. "గాడ్‌ఫాదర్ ఆఫ్‌ AI " గా పిలవబడే జియోఫ్రీ హింటన్‌ మరో ఇద్దరితో కలిసి గూగుల్‌ను విడారు. అనంతరం భవిష్యత్‌లో AI ప్రభావంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్య్వూలో ఏఐ టెక్నాలజీ అభివృద్ధి.. దీర్ఘకాలంలో తప్పుడు సమాచార వ్యాప్తి మరియు మానవులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందారు. ఏఐ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌ కోడింగ్ రాయడం, రన్‌ చేయడం ప్రారంభిస్తే అది చాలా మంది ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఏఐ.. మనుషుల కంటే తెలివైనదని, దీనిని కొంతమంది విశ్వసిస్తారని చెప్పారు.

భూమిపై ఆధిపత్యం వహిస్తున్న మనిషి మేధకు అతి త్వరలో పెను సవాల్‌ ఎదురుకాబోతున్నదన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ప్రపంచాన్ని ఊపేస్తున్న కృత్రిమ మేధనే.. మునుముందు మానవ మేధపై ఆధిపత్యం వహించే ప్రమాదం ఉందని జాఫ్రీ హింటన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఏఐ నుంచి భవిష్యత్తులో ఎదురుకానున్న ప్రమాదాల గురించి మానవ జాతిని హెచ్చరించేందుకు.. వారం క్రితమే ఆయన గూగుల్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2012లో టొరంటోలో తన ఇద్దరు శిష్యులతో కలిసి ఆయన ఏఐని సృష్టించారు. ఆ ఇద్దరు శిష్యుల్లో ఒకరు ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తున్న 'ఓపెన్‌ ఏఐ' ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్నారు. ఏఐ విషయంలో గూగుల్‌ సంస్థ ఎంతో జవాబుదారీతనంతో వ్యవహరిస్తున్నదని ప్రశంసించిన హింటన్‌, ఈ టెక్నాలజీ వల్ల తలెత్తబోయే దృష్ప్రభావాల గురించి స్వేచ్ఛగా మాట్లాడేందుకే తాను గూగుల్‌ నుంచి బయటకు వచ్చినట్టు తెలిపారు.

Tags:    

Similar News