Suez Canal: సూయజ్ కెనాల్‌కు అడ్డంగా చిక్కుకున్న భారీ నౌక.. మరింత పెరగనున్న పెట్రోల్ ధరలు..

Suez Canal: పెట్రో ధరల పేరెత్తితేనే భారతీయుల్లో గుండె దడ పెరుగుతోంది. తాజాగా ప్రపంచంలోని మరికొన్ని దేశాల్లో చమురు ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి.

Update: 2021-03-25 10:45 GMT

Suez Canal: సూయజ్ కెనాల్‌కు అడ్డంగా చిక్కుకున్న భారీ నౌక.. మరింత పెరగనున్న పెట్రోల్ ధరలు.. 

Suez Canal: పెట్రో ధరల పేరెత్తితేనే భారతీయుల్లో గుండె దడ పెరుగుతోంది. తాజాగా ప్రపంచంలోని మరికొన్ని దేశాల్లో చమురు ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి. దీనంతటికీ కారణం ఓ రాకాసి నౌక అడ్డం తిరగడమే. అదేంటి షిప్ అడ్డం తిరగడానికి పెట్రో ధరలు పెరగడానికి కారణం ఏంటి అనుకుంటున్నారా..? చాలా పెద్ద కారణమే ఉంది. ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించే సూయజ్ కాల్వలో ఓ భారీ కంటైనర్ షిప్ అడ్డం తిరింది. దీంతో దాదాపు ప్రపంచంలో సగం దేశాలకు పెట్రో ఉత్పత్తులు తరలించే పదుల సంఖ్యలో ఓడలు దారి లేక ఆగిపోయాయి.

ఈజిప్టు సమీపంలో మధ్యదరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలిపే సూయజ్ కాలువకు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య మార్గాల్లో ఒకటిగా గుర్తింపు ఉంది. ఆసియా, మధ్యప్రాశ్చం, ఐరోపా దేశాలను కలిపే ఈ ఇరుకైన దారి నుంచి ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం సరకు రవాణా జరుగుతుంది. తాజాగా ఎవర్ గివెన్ అనే భారీ సరుకు రవాణా నౌక బలమైన గాలులతో కాలువలో అడ్డంగా చిక్కుకుపోయింది. దాదాపు 400మీటర్లు పొడవు, 59 మీటర్లు వెడల్పు ఉన్న ఈ భారీ నౌకను విడిపించడానికి రెస్క్యూ సిబ్బంది ప్రత్యేక పడవలను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ అంతటికీ ఇంకొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

మరోవైపు ఈ ప్రమాదం ప్రపంచ వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపనుందని నౌకాయాన నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ నౌకను తీయలేకపోతే, అందులోని కంటైనర్లను దింపాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి రాకపోకలు సాధ్యపడకపోవడంతో మార్గానికి ఇరువైపులా భారీ సంఖ్యలో నౌకలు నిలిచిపోయాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధనం ధరలు పెరుగుతున్నాయి. సూయజ్ కాలువ దగ్గర రద్దీ పెరగడంతో ఈజిప్ట్ పాత మార్గాన్ని తిరిగి తెరిచింది. దీని ద్వారా కొన్ని చిన్న నౌకలను తరలించి రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక సూయజ్ కాల్వ ద్వారా ప్రతిరోజు 10 లక్షల బ్యారెక్‌ల ముడి చమురు రవాణా అవుతుంది. దీంతో పలు దేశాలకు ముడిచమురు రవాణా నిలిచిపోనుంది. దీంతో ఆయా దేశాల్లో క్రూడ్ ఆయిల్ ధరలు మరింత పెరగబోతున్నట్లు తెలుస్తున్నాయి. అయితే మనదేశానికి వచ్చే మార్గానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పలు దేశాలు సూయజ్ కాల్వలో రవాణా నిలిచిపోవడంతో మరింత సంక్షోభం నెలకొన బోతోంది.

Tags:    

Similar News