ప్రపంచాన్ని వణికిస్తోన్న మరో ప్రాణాంతక వైరస్.. ఆఫ్రికాలో వెలుగు చూసిన మార్బర్గ్ వైరస్
Marburg Virus: ప్రపంచాన్ని మరో ప్రాణాంతక వైరస్ వణికిస్తోంది.
Marburg Virus: ప్రపంచాన్ని మరో ప్రాణాంతక వైరస్ వణికిస్తోంది. మొన్న కోవిడ్, నిన్న మంకీపాక్స్, తాజాగా మార్బర్గ్ వైరస్. ఆఫ్రికాలోని ఘనా దేశంలో అతి ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ బుసలు కొడుతోంది. ఈ పాటికే రెండు కేసులు వెలుగు చూసినట్టు ఘనా అధికారికంగా ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం మరణించిన ఇద్దరికి పరీక్షలు నిర్వహించగా ఈ వైరస్ నిర్ధారణ అయ్యిందని పేర్కొంది.
ఈ నెల 10నే పాజిటివ్‌గా తేలినప్పటికీ ఫలితాలను మరోమారు తనిఖీ చేసేందుకు సెనెగల్‌లోని ల్యాబ్‌కు పంపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కేసులు వెలుగు చూసిన ప్రాంతంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలు చేపట్టింది. బాధితులతో కలిసిన వారిని ఐసోలేషన్‌కు తరలించామని, ఎవరిలోనూ వైరస్ లక్షణాలు కనిపించలేదని పేర్కొంది. ఈ వైరస్ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది.