Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో రెచ్చిపోతున్న తాలిబన్లు
* హెరాత్ నగరంలో వ్యాపారిని కిడ్నాప్ చేసిన వారికి శిక్ష * మృతదేహాలను క్రేన్లకు వేలాడదీసిన తాలిబన్లు
Afghanistan: ఆఫ్ఘాన్‌లో ప్రపంచ దేశాలు ఊహించిందే జరుగుతోంది. షరియా చట్టం అమలు చేసి తీరుతామని ఇటీవలే ప్రకటించిన తాలిబన్ మూకలు ఇవాళ రెచ్చిపోయాయి. ఏకంగా నలుగురు వ్యక్తులను కిరాతకంగా కాల్చి చంపాయి. అంతేనా, చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను క్రేన్లకు వేళాడదీసి వికృతానందం పొందాయి. ఆఫ్ఘాన్‌లోని హెరాత్‌లో వ్యాపారిని కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తులను చెరబట్టిన తాలిబన్లు తుపాకులతో కాల్చి చంపేశారు.
అనంతరం వాళ్ల మృతదేహాలను క్రేన్లకు వేళాడదీసిన విజువల్స్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. మరోవైపు రెండు రోజుల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ లో షరియా చట్టం అమలు చేసి తీరుతామని ప్రకటించారు తాలిబన్లు. తప్పు చేసిన వారి కాళ్లు, చేతులు నరకడం ద్వారా శిక్షిస్తామని ప్రకటించారు. ఇది జరిగి రెండు రోజులైనా గడవక ముందే నలుగురు వ్యక్తులను దారుణంగా హతమార్చడం ఆందోళన కలిగిస్తోంది.