యుద్ధ రంగంలో దిగిన మాజీ మిస్ ఉక్రెయిన్

ఆర్మీ యూనిఫామ్ లో తుపాకీ చేతపట్టిన మాజీ మిస్ ఉక్రెయిన్

Update: 2022-03-01 12:00 GMT

యుద్ధ రంగంలో దిగిన మాజీ మిస్ ఉక్రెయిన్

Anastasiia Lenna: రష్యా దాడితో ఉక్రెయిన్లోని నగరాలు వణుకుతున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు నేల కూలుతున్నాయి. వందల సంఖ్యలో పౌరులు, సైనికులు నేలరాలుతున్నారు. అయినా పుతిన్ సేనలు దూసుకొస్తూనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి మద్దతుగా సామాన్య ప్రజలు యుద్ధ రంగంలోకి దూకుతున్నారు. సెలెబ్రిటీలు కూడా ఆయుధాలు చేతబడుతున్నారు.

తన దేశాన్ని శత్రు మూకల నుంచి కాపాడుకునేందుకు మాజీ మిస్‌ ఉక్రెయిన్‌ అనస్తాసియా లెన్నా కూడా ఆయుధం చేతపట్టింది. తుపాకీతో రణరంగంలోకి అడుగుపెట్టింది. రష్యా సేనలను హెచ్చరిస్తూ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతూ లెన్నా చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి. ఉక్రెయిన్‌కు సాయం చేయాలంటూ ప్రపంచ దేశాలను కోరుతోంది.

అనస్తాసియా లెన్నా అకడమిక్ పరంగా కూడా ఉన్నత విద్యావంతురాలు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని స్లావిస్టిక్ యూనివర్సిటీ చదువుకున్నది. 2015 లె జరిగిన ఉక్రెయిన్ అందాల పోటీల్లో మిస్ ఉక్రెయిన్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఐదు భాషల్లో మాట్లాడే అనస్తాసియా లెన్నాకు ఇన్ స్టా గ్రామ్ లో 2లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఆర్మీయూనిఫామ్ లో, అసాల్ట్‌ రైఫిల్‌ చేతబట్టి ఓ బిల్డింగ్‌ దగ్గర గస్తీ కాస్తున్న ఫొటోను ఈ అనస్తాసియా లెన్నా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. ఉక్రెయిన్‌ సరిహద్దును దాటేవారు ప్రాణాలతో మిగలరు' అంటూ హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News