Heavy Rains: స్పెయిన్‌లో భారీ వర్షాలు

Heavy Rains: జలదిగ్భంధంలో అనేక నగరాలు

Update: 2021-09-02 08:08 GMT

స్పెయిన్ ఓ భారీ వర్షాలు (ఫైల్ ఇమేజ్)

Heavy Rains: స్పెయిన్‌లోని అనేక ప్రాంతాల్లో తీవ్ర వర్షపు తుఫాను విధ్వంసం సృష్టించింది. అనేక నగరాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. కొన్ని పట్టణాల్లో భారీ వరదలు సంభవించాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అధిక ఉష్ణోగ్రతలు, తేమ కారణంగా బలం పుంజుకున్న తుఫాను అల్కానార్‌ ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని వీధులు ప్రవాహాలుగా మారాయి. భారీ నీటి ప్రవాహంతో కార్లు, ఫర్నిచర్, కొట్టుకుపోయాయి. మొబైల్ కమ్యూనికేషన్‌లు కూడా దెబ్బతిన్నాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఇళ్లల్లో, వాహనాలు చిక్కుకున్న అనేకమందిని రెస్క్యూ టీం కాపాడింది. నిరాశ్రాయులైన వారిని స్థానిక క్రీడా మైదానానికి తరలించారు. అల్కానర్ ప్రాంతంలో దాదాపు 7వేల ఇళ్లకు విద్యుత్త్ స్తంభించింది. అనేక రోడ్లు తెగిపోవడంతో రాకపోకలను నిషేధించారు. అటు పలు రైళ్లను నిలిపివేశారు. స్పానిష్ రాజధాని మాడ్రిడ్, టోలెడో మధ్య హై-స్పీడ్ రైలు లింక్‌ను నిలిపివేశారు. 

Tags:    

Similar News