Floods in Indonesia: ఇండోనేషియాలో వరదలు..16 మంది మృతి
Floods in Indonesia: గత కొద్దిరోజులుగా ఇండోనేషియాను వరదలు ముంచెత్తుతున్నాయి.
Floods in Indonesia: గత కొద్దిరోజులుగా ఇండోనేషియాను వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా సులవేసి ప్రావిన్సులో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. దాంతో16 మంది మరణించారు. అలాగే దాదాపు 23 మంది గల్లంతయినట్లు జాతీయ విపత్తు సహాయ బృందం ప్రతినిధి రాదిత్య జాతి తెలిపారు. వరదల కారణంగా పలు గ్రామాలు నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. ఇక వరదల్లో గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు సాగుతున్నాయని, అయితే వర్షం కారణంగా సహాయకచర్యలకు ఇబ్బంది ఏర్పడినట్టు రాదిత్య జాతి తెలిపారు.
కాగా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సులవేసి ప్రావిన్సులో మూడు నదులు పూర్తిగా నిండాయి. దీంతో నీరు బయటికి ప్రవహించింది. ఈ క్రమంలో నదికి పక్కనే జీవనం సాగిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల కారణంగా ఇప్పటికే వందలాది ఇళ్లు ధ్వంసం అయినట్లు గుర్తించారు. దాదాపు 4000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులైనట్లు ఉత్తర లువు జిల్లా కలెక్టర్ ఇందాపుత్రి పేర్కొన్నారు. ఇదిలావుంటే గత నెలరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటి వరకూ అందిన అధికారిక సమాచారం ప్రకాం 86 మంది మృతి చెందారని, డజన్ల కొద్ది ప్రజలు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.