Stone Baby Girl: శిలగా మారుతున్న5 నెలల చిన్నారి
Stone Baby Girl: 9 నెలలు మోసి కని పెంచిన పిల్లలపై తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.
Stone Baby Girl: 9 నెలలు మోసి కని పెంచిన పిల్లలపై తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. మనం రోజు చూస్తున్నాం.., చూపిస్తున్నాం.. అలాంటింది తమ పిల్లలకు ఏదైనా జరిగితే వారి వేదన ని మాటల్లో చెప్పలేం. ఇదే పరిస్థితి ఇప్పుడు ఇంగ్లాండ్ దేశంలోని హెలెన్ హెంప్ స్తేడ్.., హెర్ట్ పోర్డ్ షెడ్ లో నివసిస్తున్న అలెక్స్ మరియు దవె దంపతులకి ఎదురైంది. లెక్సి రాబిన్స్ అనే అయిదు నెలల చిన్నారి ఫైబ్రోడిస్ప్లాసియా ఓసిఫికన్స్ ప్రోగ్రెసివా అనే అరుదైన వ్యాధితో బాధ పడుతుంది. దీంతో ఈ పాప శరీరంలో వింత మార్పులు చోటు చేసుకున్నాయి. ఆమె తన చేతి మరియు కాలి బొటన వేలు చలనం లేకుండా రాయిగా మారిపోయాయి. ఇలాంటి జబ్బు 20 లక్షల్లో ఒకరికి సోకుతుందని డాక్టర్స్ చెబుతున్నారు.
ఈ జబ్బు వల్ల కండరాలు మరియు వాటిని కలిపి ఉంచే టెండాన్స్, లిగిమెంట్ స్థానంలో ఎముకలు ఏర్పడతాయని డాక్టర్స్ వెల్లడించారు. వీరి జీవిత కాలం కూడా 40 సంవత్సర కాలం కంటే ఎక్కువ ఉండదని అందులో కూడా వారు 20 ఏళ్ళకే నడవలేని స్థితిలో మంచానపడుతారని అక్కడి డాక్టర్స్ చెప్పుకొచ్చారు . ఇప్పటికి ఈ వ్యాధికి చికిత్స లేదని ఇంగ్లాండ్ ప్రముఖ పిడియాట్రిక్ తెలుపడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులతో పాటు అందరి మనసులను కలిచివేసింది. మరోపక్క పాప పరిస్థితిని వివరిస్తూ తమకి తోచిన సహాయం చేయాలనీ చిన్నారి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ పాప తల్లిదండ్రులు విరాళాలు కూడా సేకరిస్తున్నారు.