ప్రతి ఏటా ఫిబ్రవరి 14.. వేలంటైన్స్ డే.. ప్రేమికుల రోజు. ప్రేమ పక్షుల కబుర్లు, కంటున్న కలలు, మురిపాల ఊసులు. కాలమన్నది తెలియకుండా చకచకా నడిచిపోయే తీపి గుర్తులకు ఇది స్పెషల్ గిఫ్ట్ డే. ప్రేమను వ్యక్తపరచడానికి ప్రత్యేకంగా ఒక రోజంటూ లేపోయినా ఏ నాడో జరిగిపోయిన ఓ యధార్థ ఘటనకు ఇది ప్రతిరూపం.
ఇదిలా ఉంటే ప్రపంచ ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆ దేశ ప్రథమ పౌరురాలు జిల్ ప్రేమలోకంలో మునిగారు. అంతేకాదు అధ్యక్ష భవనం ఆవరణంతా లవ్ సింబల్స్‌తో నింపేశారు. వాషింగ్టన్‌లోని శ్వేతసౌధం ఆవరణలో హార్ట్ సింబల్స్, యూనిటీ, హోప్, లవ్ అని రాసి ఉన్న రెడ్ హార్ట్ సింబల్స్, పోస్టర్లను అలంకరించారు.
బైడన్, ఆయన భార్య జిల్‌తోపాటు వారు పెంచుకుంటున్నరెండు జర్మన్ శునకాలు ఛాంప్, మేజర్‌తోపాటు ఆ పచ్చిక బయళ్లల్లో కలియ తిరిగారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ తమ పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. కరోనా పాండమిక్‌లో ప్రేమికుల రోజున ప్రతీవ్యక్తి కొద్దిపాటి జాయ్, లిటిల్ హోప్‌తో ఉండాల్సిందేన్నన్నారు జిల్.