Facebook - Taliban: తాలిబన్లకు ఫేస్‌బుక్ షాక్
Facebook: ఫేస్‌బుక్ తాలిబన్లపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది.
Facebook - Taliban: ఫేస్‌బుక్ తాలిబన్లపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను వినియోగించకుండా నిషేధం విధించింది. తాలిబన్లకు మద్దతుగా ఉన్న కంటెంట్‌పై కూడా ఫేస్‌బుక్ నిషేధం విధించనుంది. తాలిబన్లకు అనుకూలంగా ఉన్న కంటెంట్, వీడియోలను, పోస్ట్‌లను తొలగించేందుకు ప్రత్యేకమైన ఆప్ఘన్ నిపుణుల బృందాన్ని ఫేస్‌బుక్ ఏర్పాటు చేసింది. తాలిబన్లను యూఎస్ టెర్రరిస్టు సంస్థగా గుర్తించిన్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది.