Ukraine Crisis: ఉక్రెయిన్‌లో తీవ్ర ఉద్రిక్తలు

Ukraine Crisis: ఆందోళనకు గురువుతున్న కీవ్‌ ప్రజలు

Update: 2022-02-24 07:15 GMT

ఉక్రెయిన్‌లో తీవ్ర ఉద్రిక్తలు

Ukraine Crisis: రష్యా సైనిక చర్యకు దిగుతున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించడంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ పట్ణణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు పట్టణాన్ని వీడి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజలను లక్ష్యంగా చేసుకోమని రష్యా ప్రకటించింది. అయితే ఇప్పటికే పలువురు పౌరులు మృతి చెందినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. దీంతో కీవ్‌ ప్రజలు ప్రాణాలు అరచేతపట్టుకుని.. కార్లలో వెళ్లిపోతున్నారు. దీంతో నగరంలోని దారులున్నీ ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించిపోయింది. గంటల తరబడి కార్లు క్యూలో నిలిచిపోయాయి.

ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయమని రష్యా ప్రకటించినా నగరాలపైనా దాడులు చేస్తోంది. కీవ్‌లోని నగరంలో మిసైల్ శకలాలు కనిపిస్తున్నాయి. దీంతో తమకు భద్రత లేదని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే కీవ్‌ పట్టణాన్ని వీడి వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ఐదు రష్యాకు చెందిన ఐదు విమానాలు, ఒక హెలికాప్టర్‌ను కూల్చేసినట్టు ఉక్రెయిన్‌ ప్రకటించింది. 

Tags:    

Similar News