France: ఫ్రాన్స్ అధ్యక్ష పీఠం మళ్లీ మెక్రాన్ దే

France: ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ విజయం

Update: 2022-04-25 04:00 GMT

France: ఫ్రాన్స్ అధ్యక్ష పీఠం మళ్లీ మెక్రాన్ దే

France: ఫ్రాన్స్‌ అధ్యక్ష పీఠం మరోసారి ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌నే వరించింది. ఇటీవల జరిగిన ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి మెరీన్‌ లీ పెన్‌పై మెక్రాన్‌ స్పష్టమైన విజయం సాధించారు. మాక్రాన్‌కు 58 శాతం ఓట్లు రాగా, పెన్‌కు 42 శాతం ఓట్లు పడ్డాయి. అధికారిక ఫలితాలు వెలువడక ముందే ప్రత్యర్థి మరీన్‌ లీపెన్‌ ఓటమిని అంగీకరించారు. గడిచిన 20 ఏళ్లలో వరుసగా రెండు సార్లు ఫ్రాన్స్ అధ్యక్షుడైన వ్యక్తిగా మాక్రాన్‌ రికార్డు సృష్టించారు. మెక్రాన్ విజయం సాధించడంతో ఆయన మద్దతుదారులు ఈఫిల్ టవర్ ముందు జాతీయ గీతాన్ని పాడుతూ ఫ్రాన్స్‌, యూరోపియన్ జెండాలను ఊపారు.

ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మరీన్‌ లీపై గెలిచి 39 ఏళ్ల మెక్రాన్‌ ఫ్రాన్స్‌ లో అతిపిన్న వయసు గల అధ్యక్షుడిగా రికార్డులకెక్కాడు. కేవలం ఐదేళ్లలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రాజకీయాల్లో యువనేత‌గా ఎదిగారు. యూరోపియన్ యూనియన్‌లో కీలక నిర్ణయాలు తీసుకునే ప్రధాన ప్రపంచ నాయకుడిగా ఎదిగిన మెక్రాన్ ఉక్రెయిన్‌- రష్యా యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలలో దౌత్యవేత్తగా పాల్గొన్నాడు. బాహాటంగా మాట్లాడే మాక్రాన్, తన కనికరంలేని దౌత్య క్రియాశీలతతో తన స్వంత మార్గాన్ని ఎంచుకున్నారు. అంతర్జాతీయంగా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.

రెండవసారి ఫ్రెంచ్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన మెక్రాన్‌కు ప్రపంచవ్యాప్తంగా నాయకుల నుండి అభినందనలు వెల్లువెత్తాయి. మెక్రాన్‌తో కలిసి ఫ్రాన్స్, ఐరోపాలను మరింత అభివృద్ధి చేస్తామని ఈయూ చీఫ్‌ ఉర్సులా వాన్‌డర్ లేయెన్ ట్వీట్ చేశారు. ఈయూ, నాటోలో విస్తృతమైన సహకారాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News