Donald Trump: కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యం.. తాజా ఫలితాలతో మొత్తం 7 స్వింగ్ స్టేట్స్ క్లీన్ స్వీప్

Update: 2024-11-10 05:30 GMT

Donald Trump wins Arizona: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యం కొనసాగుతోంది. ఆరిజోనా రాష్ట్రంలోనూ రిపబ్లికన్ పార్టీ వశమైంది. శనివారం వెలువడిన తాజా ఫలితాల అనంతరం డొనాల్డ్ ట్రంప్ మొత్తం 7 స్వింగ్ స్టేట్స్ క్లీన్ స్వీప్ చేసినట్లయింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అప్పటి డెమొక్రటిక్ అభ్యర్థిగా నిలిచిన జో బైడెన్ ఆరిజోనా మొత్తాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. కానీ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆ ఫలితాన్ని తారుమారుచేసి మరోసారి ఆరిజోనా తన వైపు తిప్పుకోవడంలో డోనల్డ్ ట్రంప్ సక్సెస్ అయ్యారు.

ఆరిజోనా రాష్ట్రం నుండి 11 మంది ఎలక్టార్స్ ఉంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజ్ దశలో అభ్యర్థులకు అత్యధిక ఓట్లను అందించే రాష్ట్రాల్లో ఇది కూడా ఒకటి. అలా రిపబ్లికన్ పార్టీ నుండి బరిలో దిగిన 11 మందిని గెలిపించుకోవడం ద్వారా డోనల్డ్ ట్రంప్ మొత్తం మద్దతు 312 కు పెరిగింది. మరోవైపు డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు లభించిన మద్దతు 226 గా మాత్రమే ఉంది. జో బైడెన్ గత ఎన్నికల్లో ఆరిజోనాను గెలుచుకున్న తరువాత ఇక్కడ డెమొక్రాట్స్‌కి భారీ మద్దతు కనిపించింది. కానీ ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం ఆ ట్రెండ్‌ని రివర్స్ ట్రెండ్ చేశాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా ఉండే ఏడు రాష్ట్రాల్లో జార్జియా, మిచిగాన్, నెవడా, పెన్సిల్వేనియా, విస్ కన్సిన్, నార్త్ కరోలినా, ఆరిజోనా ఉన్నాయి. ఈ అన్ని రాష్ట్రాల్లోని ఓటర్లు 2020 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్‌ను ఆదరించలేదు. కానీ ఓడిన చోటే గెలిచారన్న చందంగా డోనల్డ్ ట్రంప్ ఈసారి ఆ ఏడు రాష్ట్రాలను క్లీన్ స్వీప్ చేసి అక్కడి ఓటర్లను డెమొక్రాట్స్ నుండి రిపబ్లికన్స్ వైపు తిప్పుకోగలిగారు. 

Tags:    

Similar News