Trump vs Harris: వాడివేడిగా ట్రంప్, కమలా మధ్య తొలి డిబేట్..
US Presidential Debate: అమెరికా అధ్యక్ష పోరుకు ముందు అభ్యర్థుల మధ్య కీలక డిబేట్ జరిగింది.
US Presidential Debate: అమెరికా అధ్యక్ష పోరుకు ముందు అభ్యర్థుల మధ్య కీలక డిబేట్ జరిగింది. ఆర్థిక విధానాలు, ట్యాక్స్, వలసలపై ట్రంప్, కమలాహారిస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో పాటు ఆప్ఘనిస్తాన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణపై ఇరివురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. తమను తాము కాపాడుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని హారిస్ వాదించగా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో అమెరికన్ల సొమ్మును బైడెన్ వృధా చేశాడంటూ ట్రంప్ విరుచుకుపడ్డారు.
ట్రంప్‌కి ఏ ప్లానూ లేదని కమలా హారిస్ అనడంతో.. హారిస్‌కి కూడా ప్లాన్ లేదనీ, ఆమె, బైడెన్‌ను కాపీ కొడుతోందని ట్రంప్ అన్నారు. కమలా హారిస్ ఒక మార్క్సిస్ట్ అన్న ట్రంప్.. ప్రమాదకరమైన పాలసీతో దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని ట్రంప్ టార్గెట్ చేశారు. ఇలా ఈ డిబేట్ హాట్ హాట్‌గా సాగింది. మరి దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ డిబేట్‌లో ఎవరిది పైచేయి అనేది.. ఒకట్రెండు రోజుల్లో తెలుస్తుంది.