Donald Trump| కరోనా వాక్సిన్‌పై ట్రంప్ కీలక ప్రకటన
Donald Trump| కరోనా.. ప్రపంచ దేశాలను భయభంత్రులకు గురి చేస్తున్న మహమ్మారి. ప్రపంచ దేశాలను ఆర్థికంగా కుదులు చేసింది. ఈ వైరస్ ని అంతం చేయడానికి.. పలు దేశాల శాస్త్రవేత్తలు, డాక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Donald Trump| కరోనా.. ప్రపంచ దేశాలను భయభంత్రులకు గురి చేస్తున్న మహమ్మారి. ప్రపంచ దేశాలను ఆర్థికంగా కుదులు చేసింది. ఈ వైరస్ ని అంతం చేయడానికి.. పలు దేశాల శాస్త్రవేత్తలు, డాక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ పై అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం చివరి నాటికి కరోనాను అంతం చేయగలమని, ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ వెలుడతుందని అన్నారు.
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్‌ను అధికారికంగా స్వీకరించిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా ఆయన 'ఆపరేషన్ వార్ప్ స్పీడ్' కింద కరోనా వైరస్ కట్టడి కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వారందరి కృషితో ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసి కరోనాను ఖతం చేస్తాము' అన్నారు ట్రంప్. ఇప్పటికే మూడు వ్యాక్సిన్‌ల ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయని.. త్వరలోనే వాటి ఉత్పత్తి ప్రారంభించి ఈ ఏడాదిలోనే అందుబాటులోకి తీసుకోస్తామని తెలిపారు.ఇక అమెరికాలో ఇప్పటి వరకు 60,46,634 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనాను జయించి 33,47,940 మంది కోలుకున్నారు. అమెరికాలో ఇప్పటి వరకు 184,796 మంది మరణించారు. ప్రస్తుతం అమెరికాలో 25,13,898 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 16,231 మంది పరిస్థితి విషమంగా ఉంది.
రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిగా ట్రంప్ రెండోసారి నామినేషన్ స్వీకరించడం గమనార్హం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరగనున్నాయి. అభ్యర్థిత్వాన్ని స్వీకరించిన సందర్భంగా ట్రంప్.. ప్రత్యర్థి అయిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌పై విరుచుకుపడ్డారు. అమెరికా స్వప్నాలను జో బైడెన్ నాశనం చేస్తారని, రానున్న ఎన్నికల్లో బైడెన్ గెలిస్తే అమెరికా స్వప్నాలకు ప్రమాదమని ట్రంప్ చెప్పుకొచ్చారు. డెమొక్రాట్లకు అధికారమిస్తే అరాచకవాదులకు స్వేచ్ఛనివ్వడమేనని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.