అమెరికా అధ్యక్ష పీఠానికి బై చెప్పిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇవాళ ఉదయం వాషింగ్టన్‌కు బాయ్ బాయ్ చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇవాళ ఉదయం వాషింగ్టన్‌కు బాయ్ బాయ్ చెప్పారు. ఇన్నాళ్లు బైడెన్ విజయాన్ని ఒప్పుకోని ట్రంప్.. చివరగా ఆయనకు సానుకూల వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తన ట్రంపరితనంతో రెండు సార్లు అభిశంసనం ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షుడిగా అప్రదిష్టను మూటగట్టుకున్నారు.
నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్.. శ్వేతసౌధం నుంచి వెళ్లే వరకు తన పరాజయాన్ని అంగీకరించలేదు. బుధవారం ఉదయం అధ్యక్ష హోదాలోనే ఆయన వాషింగ్టన్‌ను వీడారు. వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడా వెళ్లే ముందు... జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద వీడ్కోలు స్పీచ్ ఇచ్చారు. కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వానికి అధికారం అప్పగిస్తున్నానన్న ట్రంప్.. తన రాజకీయ జీవితం ఇప్పుడే మొదలైందన్నారు. కేపిటల్ భవనంపై దాడిని ఖండించిన ఆయన.. రాజకీయ అల్లర్లు అగ్రరాజ్యానికే అవమానం అన్నారు. అమెరికన్స్ బైడెన్ టీమ్‌కు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. రాబోయే ప్రభుత్వానికి సహకరించాలన్నారు. బైడెన్ పాలన సక్సెస్ కావాలంటూ ప్రార్థించాలని తెలిపారు.