ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్.. నేనే గెలిచాను అంటూ ట్వీట్!
అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న ట్రంప్ కి ఏటా 1.6కోట్ల రూపాయల పెన్షన్ వస్తుంది.. ఏటా సమీక్షలో ఈ పెన్షన్ మొత్తంలో మార్పులు జరగవచ్చు కూడా.
హోరాహోరిగా సాగిన అమెరికా అద్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పైన డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.. దీనితో అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ వచ్చే ఏడాది జనవరి 20 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు గాను బైడెన్ 284 ఓట్లు సాధించగా, డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమయ్యారు. అటు భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు..
అయితే ఓటమిని మాత్రం ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు.. ఫలితాలు వెలువడకముందు తానే అధ్యక్షుడిగా ట్రంప్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.. ఫలితాలు వచ్చాక కూడా తానే గెలిచినట్టుగా ట్రంప్ ట్వీట్ చేశారు. "మా పార్టీ పరిశీలకుల్ని కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదు. ఎన్నికల్లో నేనే గెలుపొందాను. 7,10,00,000 లీగల్ ఓట్లు సాధించాను. పదవిలో ఉండి రెండోసారి పోటీ చేసిన ఏ అధ్యక్షుడికీ ఈ స్థాయిలో ఓట్లు రాలేదు. ఇలా ఎప్పుడూ జరగలేదు. అడగకున్నా అనేక మందికి మెయిల్-ఇన్ బ్యాలెట్లు పంపారు..నేనే గెలిచాను " అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.
ట్రంప్ కి ఎంత పెన్షన్?
అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న ట్రంప్ కి ఏటా 1.6కోట్ల రూపాయల పెన్షన్ వస్తుంది.. ఏటా సమీక్షలో ఈ పెన్షన్ మొత్తంలో మార్పులు జరగవచ్చు కూడా.. ఇక మాజీ అధ్యక్షుడి భార్యకు $20 వేల పెన్షన్ వస్తుంది. వైట్ హౌజ్ ను వీడాక ఏడూ నెలల పాటు వ్యక్తిగత ఆఫీస్ ఏర్పాటు చేసుకుందుకు అద్దె, టెలిఫోన్ , ప్రిటింగ్ పోస్టల్ ఖర్చులకి గాను నిధులను ప్రభుత్వమే కేటాయిస్తుంది..