మానవ అంతంపై డైనోసర్ కీలక సందేశం.. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలంటూ..

Dinosaur: పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి చేపట్టిన సమావేశంలోకి సడెన్‌గా ఓ భారీ డైనోసర్ ఎంట్రీ ఇచ్చింది.

Update: 2021-10-28 11:02 GMT

మానవ అంతంపై డైనోసర్ కీలక సందేశం.. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలంటూ..

Dinosaur: పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి చేపట్టిన సమావేశంలోకి సడెన్‌గా ఓ భారీ డైనోసర్ ఎంట్రీ ఇచ్చింది. అంతేనా, అక్కడే ఉన్న మైక్ దగ్గరకు వెళ్లి ఓ సుదీర్ఘ ప్రసంగం కూడా చేసేసింది. అదేంటి డైనోసర్లు ఎప్పుడో అంతరించిపోయాయి కదా అనుకుంటున్నారా సరిగ్గా ఈ విషయం గురించి చెప్పడానికే ఆ డైనోసర్ వచ్చింది. ప్రపంచ పర్యావరణ మార్పులపై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి చేసిన వినూత్న ప్రయత్నమే ఈ డైనోసర్ స్పీచ్.!

రోజురోజుకూ భూతాపం పెరిగిపోతోంది. మితిమీరిన పొల్యూషన్‌తో వాతావరణం వేడెక్కిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంధనాలను తగ్గించి ఉష్ణోగ్రతలు పెరగకుండా చూడాలన్న లక్ష్యాన్ని ప్రపంచ దేశాలు నిర్ధేశించుకున్నాయి. అయితే, ఈ పర్యావరణ మార్పులపై తాజాగా డైనోసర్‌తో ఐక్యరాజ్యసమితి వినూత్న సందేశం ఇప్పించింది. అంతరించిపోయిన డైనోసార్లతో జనం అనే మనం కూడా అంతరించిపోతామని హెచ్చరకలు చేయించింది.

ఈ సమావేశంలో డైనోసర్ స్పీచ్ హైలైట్‌గా నిలిచింది. ''ప్రజలారా వినండి! మీరంతా పర్యావరణ విపత్తు దిశగా అడుగులేస్తున్నారు. ప్రతి సంవత్సరం అన్ని ప్రభుత్వాలు లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని శిలాజ ఇంధనాల సబ్సిడీ కోసం ఖర్చు చేస్తున్నాయి. ఏటా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది పేదరికంలో జీవిస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. ఇలా వినాశనంపై ఖర్చు చేయడానికి బదులు ఇలాంటి పేదలకు సాయం చేస్తే బాగుంటుందనిపించలేదా ఎప్పుడు? మీ అంతం కోసం మీరే డబ్బులు ఖర్చు చేసుకుంటారా?'' ఇవీ ఆ డైనోసర్ మానవాళికి వేసిన ప్రశ్నలు.

ఇదే సమయంలో కోవిడ్ గురించీ డైనోసర్ కామెంట్ చేసింది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదని, మహమ్మారి నుంచి కోలుకుంటూ ఇప్పుడిప్పుడే మీ ఆర్థిక వ్యవస్థలను పటిష్ఠం చేసుకుంటున్నారంది. కాబట్టి మీకు నేనిచ్చే ఓ మంచి సలహా అంటూ మీ అంతాన్ని మీరే కోరుకోకండని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇప్పటికైనా మార్పులను ఆహ్వానించి వాటికి అనుగుణంగా మారాలంది. వచ్చే మార్పుల నుంచి తప్పుకునేందుకు వంకలు వెతకొద్దని చెప్పి చివరిగా థాంక్యూ అని తన ప్రసంగాన్ని ముగించింది.


Tags:    

Similar News