Mette Frederiksen: డెన్మార్క్‌లో అనూహ్య ఘటన.. ఏకంగా ప్రధానిపైనే దాడి
Mette Frederiksen: డెన్‌మార్క్ ప్రధాని మెటె ఫ్రెడ్రిక్సెన్‌పై దాడి జరిగింది. కోపెన్‌హాగన్ స్క్వేర్ వద్ద ప్రధానిపై దుండగుడు దాడికి దిగాడు.
Mette Frederiksen: డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడ్రిక్సెన్‌పై దాడి జరిగింది. కోపెన్‌హాగన్ స్క్వేర్ వద్ద ప్రధానిపై దుండగుడు దాడికి దిగాడు. ఈ ఘటనతో ప్రధాని షాక్‌కు గురైనట్లు ఆమె కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దాడికి దిగిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన వెంటనే ప్రధానిని సెక్యూరిటీ సిబ్బంది అక్కడి నుంచి తరలించారు. యూరప్ యూనియన్‌కి ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రధానిపై దాడి తమను కలిచివేసిందని డెన్మార్క్ మంత్రి ఎక్స్‌లో పోస్టు చేశారు.
అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐరోపా యూనియన్‌కు ఎన్నికలు జరుగుతోన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కొద్దివారాల క్రితం స్లొవేకియా ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికోపై ఒక దుండగుడు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.