ట్రంప్‌ మళ్లీ తల ఎత్తుకోలేని తరహాలో షాకివ్వనున్న డెమొక్రాట్లు

అమెరికాలో ఓవైపు నూతన అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి సమయం దగ్గరపడుతుండగా.. మరోవైపు రోజు రోజుకూ రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి.

Update: 2021-01-11 04:09 GMT

అమెరికాలో ఓవైపు నూతన అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి సమయం దగ్గరపడుతుండగా.. మరోవైపు రోజు రోజుకూ రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదార్లు దాడి చేసిననాటి నుంచి పరిస్థితులు అనూహ్యంగా తయారయ్యాయి. ప్రతినిధులసభలో ట్రంప్‌పై ఇవాళ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి డెమొక్రాట్లు సన్నాహాలు చేస్తున్నాయి.

అయితే ఇందుకు ఆయన సొంత పార్టీ అయిన రిపబ్లికన్‌ సభ్యులే మద్దతు తెలుపుతుండడం గమనార్హం. మరోవైపు 25వ రాజ్యాంగ సవరణ కింద ట్రంప్‌ను తొలగించే అంశాన్ని ఉపాధ్యక్షుడు మైక్‌‌పెన్స్‌ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ఆమోదం తెలపడానికి ఆ రోజున క్యాపిటల్‌ భవనంలోనే ఉభయసభల సంయుక్త సమావేశం జరిగింది. దీనికి పెన్స్‌ ఆధ్వర్యం వహించారు. ఈ సమావేశాన్ని అడ్డుకోవడానికే ట్రంప్‌ తన మద్దతుదార్లను రెచ్చగొట్టారు.

ఈ సందర్భంగా పెన్స్‌ భద్రత గురించి ట్రంప్‌ పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆ సమావేశంలో తనకు అనుకూలంగా వ్యవహరించలేదంటూ పెన్స్‌పై ట్రంప్‌ ఆగ్రహంతో ఉన్నారు. అధ్యక్షుడిగా ఉంటూ హింసను రెచ్చగొట్టినందున ట్రంప్‌ను వెంటనే తొలగించాలని, ఇందుకు 25వ సవరణ అధికారాలను ఉపయోగించుకోవాలని పెన్స్‌పై ఒత్తిళ్లు వస్తున్నాయి. ట్రంప్‌ తిరుగుబాటును ప్రోత్సహించారని ఆరోపిస్తూ దిగువ సభలో డెమొక్రాటిక్‌ పార్టీ సభా నాయకుడు అభిశంసన తీర్మానాన్ని ను రాశారు. దీనికి 185 మంది మద్దతు తెలిపారు. బుధవారం దీనిపై ఓటింగ్‌ జరగనుంది. అనంతరం సెనేట్‌కు పంపిస్తారు. ఆయనను పదవి నుంచి తొలగించాలా, వద్దా అనే దానిపై అక్కడ నిర్ణయిస్తారు.


Tags:    

Similar News