China: డ్రాగన్ కంట్రీపై డెల్టా పంజా
China: 18 ప్రావిన్సుల్లోని 27 నగరాలకు వ్యాప్తి * చైనా వ్యాప్తంగా 95 ప్రాంతాలకు ముప్పు
China: డ్రాగన్ కంట్రీపై డెల్టా పంజా విసురుతోంది. కొన్ని నెలలుగా ఎలాంటి కోవిడ్ కేసులు లేకుండా ప్రశాంతంగా ఉన్న చైనాలో.. డెల్టా వేరియంట్ విరుచుకుపడుతోంది. 18 ప్రావిన్సుల్లోని 27 నగరాల్లో విస్తరించడంతో డ్రాగన్ కంట్రీ కొత్త కరోనా కేసులతో అల్లాడుతోంది.
తాజాగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు అన్ని కేసులు డెల్టా రకం కేసులే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం డెల్టా పంజాతో దేశంలో డేంజర్ జోన్లు కూడా పెరిగిపోయాయి. ప్రస్తుతం చైనా వ్యాప్తంగా 95 ప్రాంతాలకు ముప్పు పొంచి ఉన్నట్లు అక్కడి అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ తెలిపింది. ఇందులో డెహోంగ్, నన్‌జింగ్, ఝెంగ్‌జౌ సహా 4 ప్రాంతాలు తీవ్ర ముప్పులో ఉన్నట్లు పేర్కొంది
ఇక రాజధాని బీజింగ్‌లో ఆదివారం బయటపడిన కొత్త కేసులు మూడింటికీ డెల్టా వేరియంట్ కారణమని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిర్ధారించింది. దీంతో అప్రమత్తమైన బీజింగ్ మున్సిపల్ గవర్నమెంట్ అప్రమత్తమైంది. కొవిడ్ వ్యాప్తి ఉన్న ప్రావిన్సుల నుంచి రాజధానికి అన్ని రకాల వాహనాల రాకపోకలను నిలిపివేసింది.
చైనాలో తాజా కొవిడ్ ఉద్ధృతి నన్‌జింగ్ విమానాశ్రయంలో కేసులతో బయటపడ్డాయి. ఇక్కడి నుంచే వైరస్ అనేక ప్రాంతాలకు వ్యాపించింది. నన్‌జింగ్‌లో ఇప్పటివరకు 204 డెల్టా కేసులు నమోదయ్యాయి. అయితే నన్‌జింగ్‌తో పాటు మరో నగరం కూడా కోవిడ్ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. దేశంలో బయట పడుతున్న చాలామేరకు కొత్త కేసులకు.. జాంగ్ జియాజీ హాట్‌స్పాట్‌గా భావిస్తున్నారు అధికారులు. జాంగ్ జియాజీలోని గ్రాండ్ థియేటర్‌లో ప్రదర్శించిన ఒక షోకి.. కేసుల వ్యాప్తికి సంబంధం ఉన్నట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది. ఈ ప్రదర్శనకు దాదాపు 2 వేల మంది హాజరయ్యారు. దీంతో షోకు వచ్చిన వారు.. వారి సన్నిహితులు, కుటుంబ సభ్యుల ట్రేసింగ్ మొదలుపెట్టారు అధికారులు.