పాక్‌లో ఆఫ్ఘన్‌ రాయబారి కూతురు కిడ్నాప్‌, హింస

Pakistan: పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Update: 2021-07-17 15:52 GMT

పాక్‌లో ఆఫ్ఘన్‌ రాయబారి కూతురు కిడ్నాప్‌, హింస

Pakistan: పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్‌లోని ఆఫ్ఘన్‌ రాయబారి నజీబుల్లా అలీఖీల్ కుమార్తెను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను దారుణంగా హింసించినట్టు తెలుస్తోంది. నజీబుల్లా కుమార్తె సిల్‌సిలా అలీఖీల్‌ జిన్నా సూపర్‌ మార్కెట్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు యువకులు ఆమెను కిడ్నాప్‌ చేశారు. ప్రతిఘటించిన సిల్‌సిలా వారి బారి నుంచి తప్పించుకొని ఇంటికి చేరుకుంది. అయితే ఆమె ఒంటిపై గాయాలు ఉండడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

ఘటనను తీవ్రంగా ఖండించిన ఆఫ్ఘాన్‌ ప్రభుత్వం పాక్‌లో తమ రాయబార కార్యాలయం అధికారులకు, వారి కుటుంబాలకు రక్షణ లేదని విచారం వ్యక్తం చేసింది. తక్షణమే వారందరికీ పూర్తి భద్రతను కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆఫ్ఘన్‌ విదేశాంగ శాఖ పాక్‌ ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ఘటనకు పాల్పడిన నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆఫ్ఘన్‌ ప్రభుత్వం సూచించింది.

Tags:    

Similar News