సంచలనం : సీక్రెట్ గా కరోనా టీకా వేసి..నోరు విప్పకుండా ఒప్పందాలు!

కరోనాకు కేంద్రమైన చైనాలో ఇప్పుడు ఓ సంచలనమైన న్యూస్ వైరల్ అవుతోంది. కరోనా రోగులకు ట్రయల్స్ దశలోనే ఉన్న టీకాను వేసి.. బయటికి

Update: 2020-09-27 10:48 GMT

కరోనాకు కేంద్రమైన చైనాలో ఇప్పుడు ఓ సంచలనమైన న్యూస్ వైరల్ అవుతోంది. కరోనా రోగులకు ట్రయల్స్ దశలోనే ఉన్న టీకాను వేసి.. బయటికి చెప్పవద్దంటూ వారివద్ద సంతకాలు తీసుకుంటున్నారట.. దీంతో టీకా సమాచారం బయటికి రావడంలేదు. అంతేకాకుండా.. ఈ విషయం బయటికి రాకుండా కొన్ని ఒప్పందాలపై రోగుల సంతకాలు కూడా తీసుకుందట చైనా ప్రభుత్వం. మీడియాకు లేదా సోషల్ మీడియాకు ఈ వార్తలు చేరకుండా చైనా ప్రభుత్వం ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, టీకా తయారు చేసే కంపెనీ సిబ్బంది, ఉపాధ్యాయులతో సహా హైరిస్క్ క్యాటగిరిలో ఉన్న వారికి అత్యవసర ప్రాతిపదికన టీకాలు వేస్తున్నారు.. అయితే గ్లోబల్ హెల్త్ నిపుణుల నుంచి అనుమతి తీసుకోకుండా ఇలా గుట్టుచప్పుడు కాకుండా టీకా వేయడం ఏమిటని ఆరోగ్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలావుంటే తాము అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతు ఉందని.. చైనా తన నివేదికలో పేర్కొంది. వ్యాక్సిన్ విషయంలో జూన్‌లో డబ్ల్యూహెచ్‌ఓకు సమాచారం ఇచ్చినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారి జెంగ్ జాంగ్‌వే రాయిటర్స్‌కు తెలిపారు. కాగా ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో దేశాలు తమ అధికార పరిధిలో వైద్య ఉత్పత్తుల వాడకాన్ని ఆమోదించవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు, అయితే ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే అని అన్నారు. దీన్ని ఉపయోగించుకొని చైనా ఎవరికీ తెలియకుండా మూడో దశ ట్రయల్స్ లో ఉన్న వ్యాక్సిన్ ను రోగులకు ఇస్తుందని నిపుణులు అంటున్నారు. క్యాన్‌సీనో సంస్థ రూపొందించిన టీకాను మిలిటరీ సిబ్బందికి ఇచ్చేందుకు చైనా ప్రభుత్వం జూన్‌లోనే అనుమతించింది.  

Tags:    

Similar News