అంతరిక్షంలోనే ఇక అంతా.. పెళ్లి చేసుకోవచ్చు... లేదా బర్త్ డే సెలబ్రేట్ ..
SPACE: భూమ్మీద తమకు నచ్చినరీతిలో డిఫరెంట్‌గా పెళ్లిళ్లు, ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకోవడం కామన్ అదే..
SPACE: భూమ్మీద తమకు నచ్చినరీతిలో డిఫరెంట్‌గా పెళ్లిళ్లు, ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకోవడం కామన్ అదే, ఆకాశంలోనో లేక అండర్ వాటర్‌లోనో చేసుకుంటే ఆ మజానే వేరు కొత్తదనం కోరుకునేవాళ్లంతా ఇలా డిఫరెంట్ ప్లేసెస్‌లో పెళ్లి లేదా బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. అలా, తమ మధుర జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే, ఇప్పటివరకు ఆకాశంలోనో సముద్ర గర్భంలోనో పెళ్లిళ్లు, బర్త్‌డేలు చేసుకోవడం చూసుంటాం ఇక, ఇప్పుడు అంతకుమించిన వేదికను చూడబోతున్నాం ఏ సందర్భాన్నైనా డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకునేవాళ్ల కోసం రోదసి వేదిక కాబోతోంది.
వారం కిందట వర్జిన్ గెలాక్టిక్ ఇప్పుడు బ్లూ ఆరిజన్ సంస్థలు అంతరిక్షంలోకి వెళ్లి రావడంతో స్పేస్ టూరిజం మొదలైపోయింది. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్లో ఆరుగురు బ్లూ ఆరిజన్ రాకెట్లో నలుగురు అంతరిక్షంలోకి వెళ్లొచ్చి కాసేపు స్పేస్‌లో చక్కర్లు కొట్టి వచ్చారు. అలా, అంతరిక్షంలోకి వెళ్లొచ్చారో లేదో వచ్చే ఏడాది నుంచే స్పేస్ టూర్లు మొదలుపెడతామంటూ వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజన్ సంస్థలు ప్రకటించాయి.
అంతరిక్షంలో తేలియాడుతూ ఫంక్షన్లు చేసుకునేందుకు 'స్పేస్ పర్‌స్పెక్టివ్' సంస్థ రంగం సిద్ధం చేస్తోంది. అతిత్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. జస్ట్ మూడేళ్లు ఆగితే చాలు మీరు అంతరిక్షంలోకి వెళ్లి మీ ఆనంద క్షణాలను స్పేస్‌లో సెలబ్రేట్ చేసుకుని వచ్చేయొచ్చు. అందుకోసం, హాట్ ఎయిర్ బెలూన్ తరహాలో ఓ భారీ హైడ్రోజన్ స్పేస్ బెలూన్‌ను, దానికి వేలాడదీసే గుండ్రడి ప్యాసింజర్ క్యాప్సూల్స్‌ను అమెరికాకు చెందిన 'స్పేస్ పర్‌స్పెక్టివ్' సంస్థ అభివృద్ధి చేస్తోంది. దీనికి 'నెప్ట్యూన్' అనే పేరు కూడా పెట్టేసింది. ఈ బెలూన్ షిప్‌లో భూమి నుంచి లక్ష అడుగులు అంటే 31కిలోమీటర్లు ఎత్తుకెళ్లి రావొచ్చు. ఈ బెలూన్ షిప్ అక్కడ రెండు గంటలపాటు ఉండి తిరిగి భూమ్మీదకు దిగుతుంది. మొత్తం టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు ఆరు గంటల సమయం పట్టనుంది.
ఈ బెలూన్ షిప్‌లో విశాలమైన అద్దాల గది, మినీ బార్, బాత్రూం, ఇంటర్నెట్ సౌకర్యం ఉంటాయి. పైలట్ కాకుండా 8మంది ప్యాసింజర్లకు ఇందులో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ముందే ఆర్డర్ చేసిన ఫుడ్, డ్రింక్స్ అందిస్తారు. గుండ్రంగా చుట్టూ అద్దాలతో ఉండే బెలూన్ షిప్‌లో అన్ని వైపులా వీక్షించవచ్చు. గత నెల్లోనే స్పేస్ పర్‌స్పెక్టివ్ సంస్థ 'నెప్ట్యూన్ వన్' పేరిట టెస్ట్ ఫ్లైట్‌ను విజయవంతంగా నిర్వహించింది. అయితే రాకెట్లు, స్పేస్ షటిల్స్ అత్యంత భారీగా శబ్దం, ఊగిపోతూ ఉంటాయి. ఒకరి మాటలు మరొకరికి వినపడే పరిస్థితే ఉండదు. అదే స్పేస్ బెలూన్‌లో అయితే మన ఇంట్లోని ఓ గదిలో ఉన్నట్టుగా నిశ్శబ్ధంగా, ప్రశాంతంగా ఉంటుందని ఈ క్యాప్సూల్‌లో వివాహాలు, పుట్టిన రోజులు వంటివి చేసుకోవచ్చని స్పేస్ పర్‌స్పెక్టివ్ సంస్థ చెబుతోంది.
స్పేస్ పర్‌స్పెక్టివ్ సంస్థ అప్పుడే పెద్ద సంఖ్యలో ఆర్డర్లు కూడా వస్తున్నాయట. అయితే, ఈ స్పేస్ బెలూన్‌లో ప్రయాణం కోసం ఒక్కొక్కరికి దాదాపు కోటి రూపాయలు వసూలు చేయనున్నారు. అప్పుడే టికెట్లు కూడా అమ్మడం మొదలుపెట్టిన స్పేస్ పర్‌స్పెక్టివ్ సంస్థ 2024నుంచి టూర్స్‌కి ప్లాన్ చేస్తోంది. అయితే, ప్రస్తుతానికి టికెట్ రేట్స్ భారీగా ఉన్నా భవిష్యత్‌లో బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్ ధరలోనే అంతరిక్షానికి వెళ్లి రావొచ్చని చెబుతున్నారు.