కరోనావైరస్ కు కేంద్రంగా ఉన్న చైనాలో గత రెండు నెలల కిందటే వైరస్ వ్యాప్తి మందగించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడప్పుడు మాత్రం ఒకటి అరా కేసులు మాత్రమే వస్తున్నాయి.. ఈ క్రమంలో గత 24 గంటల్లో చైనాలో నాలుగు కొత్త కేసులు కనుగొనబడ్డాయి..
కొత్త కేసులలో రెండు షాన్డాంగ్ ప్రావిన్స్ నుండి వచ్చాయని, మిగిలిన వాటిలో ఒకటి షాంఘై నుండి, ఒక కేసు గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ నుండి వచ్చినట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ శనివారం తెలిపింది. అలాగే కరోనా భారిన పడిన ఎవరూ మరణించినట్లు దాఖలాలు లేవని పేర్కొంది. కాగా దేశంలో ఇప్పటివరకు 82 వేల 995 మందికి కరోనా సోకగా.. ఇందులో 4634 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 72 వేలమందికి పైగా కోలుకున్నారు.