Corona Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై రష్యా గుడ్ న్యూస్.. భారత్‌కు చేరిన కరోనా వ్యాక్సిన్!
Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ పై రష్యా గుడ్ న్యూస్ అందించింది. కరోనా నియంత్రించేందుకు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆర్డీఐఎఫ్...
కరోనా వ్యాక్సిన్ పై రష్యా గుడ్ న్యూస్ అందించింది. కరోనా నియంత్రించేందుకు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆర్డీఐఎఫ్ హైదరాబాద్ కు చెందిన రెడ్డీస్ ల్యాబ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ లో స్పుత్నిక్ వ్యాక్సిన్ ట్రయల్స్ ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నిర్వహిస్తుంది. దేశంలో స్పుత్నిక్-వి టీకాను రెడ్డీస్ ల్యాబ్ సప్లై చేయనుంది. తమ వ్యాక్సిన్ కి భారత్ అనుమతించినట్లయితే వంద మిలయన్ల డోస్ లో స్పుత్నిక్ వ్యాక్సిన్ ను రెడ్డీస్ ల్యాబ్ కు సరఫరా చేయనున్నట్లు ఆర్డీఐఎఫ్ వెల్లడించింది. ఈనెల 15 తర్వాత క్లీనకల్ ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉంది.
కరోనా వ్యాక్సిన్ కోసం జరుగుతున్న ప్రయోగాల్లో అందరి కంటే ముందున్న రష్యా స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ప్రయోగాల మధ్యంతర నివేదిక విడుదల చేసింది. కరోనా రోగులపై 92 శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని ప్రకటించింది. త్వరలో వ్యాక్సిన్ విడుదల చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే రష్యాలో స్పుత్నిక్ టీకాను మార్కెట్లోకి విడుదల చేశారు. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఒప్పందం భారత్ లో హైదరాబాద్ కు చెందిన రెడ్డీస్ ల్యాబ్ తో కుదుర్చుకుంది. రెండు రోజుల క్రితమే అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ రూపొందించిన కోవిడ్ టీకా 90 శాతం సమర్ధవంతంగా ఉన్నట్లు ప్రకటించింది.
భారత్ లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ స్పుత్నిక్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహిస్తుంది. స్పుత్నిక్ వి టీకాను కూడా రెడ్డీస్ ల్యాబ్ సప్లై చేయనున్నది. రష్యన్ డైరక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ గతంలో ఈ ఒప్పందంపై ప్రకటన చేసింది. తమ వ్యాక్సిన్ కి భారత్ అనుమతించినట్లైతే వంద మిలియన్ల డోస్‌ల స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను రెడ్డీస్ ల్యాబ్‌కు సరఫరా చేయనున్నట్లు ఆర్డీఐఎఫ్ వెల్లడించింది.
రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి సాయంతో రష్యా రక్షణ శాఖ, గమలేయ పరిశోధన సంస్థ అభి వృద్ధి చేస్తున్న స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ఇంకా ప్రయోగ దశలో ఉంది. తొలి విడతగా 16 వేల మంది కరోనా వైరస్ సోకిన వారిపై రెండు దశల్లో ప్రయోగించారు. 92 శాతం ప్రభావవంతంగా పని చేసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం మూడోదశ ప్రయోగాల దశలో భాగంగా 40 వేల మందికి ప్లేస్‌బో షాట్ ఇస్తున్నారు.
కరోనా వ్యాక్సిన్ ను నమోదు చేసిన తొలి దేశంగా ఈ ఏడాది ఆగస్ట్ లో రష్యా రికార్డు సృష్టించింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను భారత్‌లో అభివృద్ధి చేయడంతో పాటు పంపిణీ చేసేందుకు రెడ్డీస్ ల్యాబ్‌తో రష్యా ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 100 మిలియన్ వ్యాక్సిన్ డోసులను భారత్‌కు పంపనుంది. వీటితో రెడ్డీస్ ల్యాబ్ రెండు, మూడు దశల ట్రయల్స్ చేపట్టనుంది. మూడో దశ ట్రయల్స్ వచ్చే ఏడాది మే నాటికి పూర్తవుతాయని అంచనా. స్పుత్నిక్ వీ దీర్ఘకాలం పాటు కరోనా వైరస్‌పై పోరాడేందుకు ఉపయోగపడుతుందని రష్యా ప్రభుత్వం చెబుతోంది. ఇది కనీసం రెండేళ్ల వరకూ కరోనా రాకుండా అడ్డుకోగలదని భావిస్తున్నారు.