Coronavirus Effect On United Nations Meeting: ఐక్యరాజ్యసమితి సమావేశాలకు కరోనా ఎఫెక్ట్.. వర్చువల్ పద్ధతిలో నిర్వహణ
Coronavirus Effect On United Nations Meeting: కరోనా ఎంత పని చేస్తుందంటే... తరాలు తరబడి అనుసరిస్తున్న విధానాలను చెక్ పెడుతోంది.
Coronavirus Effect On United Nations Meeting: కరోనా ఎంత పని చేస్తుందంటే... తరాలు తరబడి అనుసరిస్తున్న విధానాలను చెక్ పెడుతోంది... గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలను తెరపైకి తెస్తోంది. కేవలం ప్రజల జీవన విధానమే కాదు... దేశం, ప్రపంచ స్థాయిలో నిర్వహించే సమావేశాలకు సైతం ఈ కరోనా వైరస్ అడ్డంకిగా మారింది. ఏం చేయాలి... వ్యాక్సిన్ వచ్చే వరకు దానికి అనుసరించి పోవాలని అందరూ నిర్ణయించుకున్నారు. దేశంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులతో పాటు తాజాగా సెప్టంబరు నెలలో నిర్వహించే వార్షిక సమావేశాలను నిర్వహించే తీరులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఐక్యరాజ్యసమితి సమావేశాలకు సంబంధించి గతంలో మాదిరి ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కావడం కాకుండా, నేరుగా వారు వినిపించే సందేశాన్ని వీడియోలో పంపి. వినిపించేలా వర్చువల్ పద్ధతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి సమావేశాలు ఈసారి వర్చువల్ పద్ధతిలో నిర్వహించనున్నారు. కరోనా వైరస్ కారణంగా యూఎన్ ప్రధాన కార్యాలయంలో ఈ సారి సమావేశాలు జరగడం లేదు. ఇందుకు బదులుగా ప్రపంచదేశాల అధినేతల సందేశాలను వీడియోల రూపంలో ప్రదర్శించనున్నారు. 75 ఏళ్ల ఐక్యరాజ్య సమితి చరిత్రలో పరోక్షంగా సమావేశాలు నిర్వహించడం ఇదే మొదటిసారి. వైరస్ విజృంభిస్తున్న కారణంగా ఈ సమావేశాలకు ప్రత్యక్షంగా హాజరుకాకూడదని అన్ని దేశాల ప్రతినిధులు నిర్ణయించుకున్నారు.
సాధారణంగా యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు వారం పాటు నిర్వహిస్తారు. ఈ సారి నేతలు పంపిన వీడియో ప్రసంగాల రికార్డు సమయాన్ని 15 నిమిషాలు గా ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ప్రత్యేక 75వ వార్షిక సదస్సు జరుగుతుంది