డ్రాగన్ కంట్రీ మరో దుష్ట పన్నాగం.. భారత్-టిబెట్ సరిహద్దుల్లో బుల్లెట్ ట్రైన్ ప్రారంభించిన చైనా

Bullet Train: సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ డ్రాగన్ కంట్రీ మరో పన్నాగానికి తెరలేపిందా..?

Update: 2021-06-25 11:20 GMT

భారత్-టిబెట్ సరిహద్దుల్లో బుల్లెట్ ట్రైన్ ప్రారంభించిన చైనా

Bullet Train: సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ డ్రాగన్ కంట్రీ మరో పన్నాగానికి తెరలేపిందా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే చెప్పాలి. కమ్యునిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా డ్రాగన్ కంట్రీ బుల్లెట్ ట్రైన్ ప్రారంభించింది. అయితే, ఆ బుల్లెట్ ట్రైన్ ప్రారంభమైంది మాత్రం భారత్-టిబెట్ సరిహద్దుల్లో కావడం చైనా చీప్ వ్యూహాలను బయటపెడుతోంది. సరిహద్దుల్లో పట్టు పెంచుకునేందుకే చైనా ఇలాంటి చర్యలు చేపడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

టిబెట్ క్యాపిటల్ లాసా నుంచి నింగ్చీ వరకూ 435.5 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గంతోపాటు బుల్లెట్ ట్రైన్‌ను చైనా ప్రారంభించింది. టిబెట్‌లో ఇదే తొలి బుల్లెట్ ట్రైన్ కాగా అరుణాచల్ ప్రదేశ్‌కు సమీపంలో ఉన్న నింగ్చీకి బుల్లెట్ ట్రైన్ ప్రారంభించడం చైనా వ్యూహాన్ని బయటపెడుతోంది. ఈ బుల్లెట్ ట్రైన్ ద్వారా చైనా బలగాలను అత్యంత వేగంగా ఈ ప్రాంతంలో చేరవేసే అవకాశం ఏర్పడింది. అటు అరుణాచల్‌ ప్రదేశ్‌ దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ రైలు మార్గం ఏర్పాటు ఆందోళన కలిగిస్తోంది.

Tags:    

Similar News