China Lady SPY arrest in America: అమెరికాలో చైనా లేడీ గూఢచారి అరెస్టు

China Lady SPY arrest in America: ప్ర‌పంచ దేశాలను క‌రోనా మ‌హ‌మ్మారి క‌బ‌లిస్తున్న‌ది. అగ్ర దేశ‌మైన అమెరికా కూడా క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని అల్లాడుతుంది. ల‌క్ష‌లాది మంది క‌రోనా బారిన ప‌డగా, వేలాది మంది మృత్యు వాత ప‌డ్డారు.మ‌రికొంద‌రు

Update: 2020-07-24 09:50 GMT
China Lady SPY arrest in America

China Lady SPY arrest in America: ప్ర‌పంచ దేశాలను క‌రోనా మ‌హ‌మ్మారి క‌బ‌లిస్తున్న‌ది. అగ్ర దేశ‌మైన అమెరికా కూడా క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని అల్లాడుతుంది. ల‌క్ష‌లాది మంది క‌రోనా బారిన ప‌డగా, వేలాది మంది మృత్యు వాత ప‌డ్డారు. మ‌రికొంద‌రు చావుతో పోరాడుతున్నారు. అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ చాలా దెబ్బ‌తిన్న‌ది. ఈ వైర‌స్ వ్యాప్తికి చైనానే కార‌ణ‌మంటు అమెరికా అనేక ఆరోప‌ణ‌లు చేసింది. ఈ విష‌యంలో ఇరు దేశాల మ‌ధ్య ప్రాచ్చ‌న్న యుద్ధం జ‌రుగుతుంది. అలాగే గ‌త కొంతకాలం క్రితం అమెరికా అగ్ర కంపెనీలైన ఆపిల్‌, అమెజాన్‌ వంటి 20 కంపెనీలపై చైనా గూఢచార్యం చేస్తుందని, చైనా ఫ్యాక్టరీలు తయారుచేసిన మదర్‌బోర్డును వాడుతున్న అమెరికా కంపెనీలపై డ్రాగన్‌ గూఢచార్యం చేస్తుందని… ఆ మదర్‌బోర్డ్‌లో ఓ మైక్రోచిప్‌ను అమర్చి, అమెజాన్‌, ఆపిల్‌ వంటి 28 ఇతర అమెరికా కంపెనీలు, సంస్థల సర్వర్లను చైనా హ్యాక్‌ చేస్తుందని ఓ యూఎస్‌ పత్రిక ప్రచురించడంతో.. ఈ వివాదం మ‌రింత తీవ్ర స్థాయికి చేరింది.

అయితే ఇప్పుడు.. ఈ ఆరోప‌ణ‌లు ఊత‌మిచ్చే విధంగా.. చైనాకు చెందిన ఓ మ‌హిళ‌ గూఢాచారిని అమెరికా పోలీసులు పట్టుకున్నారు. అమెరికాలోకి ఓ విద్యార్థిలా ఎంట్రీ ఇచ్చింది. అక్కడి కేన్సర్ ఆస్పత్రిలో రిసెర్చ్ స్టూడెంట్‌గా చేరింది. నెమ్మదిగా అక్కడి సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నట్లుగా FBI అధికారులు గుర్తించారు. పట్టుబడిన తర్వాత ఆమెకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. గూఢాచర్యం నిర్వహిస్తున్న యువతి చైనీస్ మిలటరీ ఆఫిసర్ "తంగ్ జువాన్"గా గుర్తించారు. అయితే ఇలా దేశంలోకి మొత్తం 25 మంది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులు వచ్చినట్లుగా FBI గుర్తించింది. వారిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలను ముమ్మరం చేసింది.

Tags:    

Similar News