అమెరికాను తలదన్నిన చైనా.. జెట్ స్పీడ్‌లో పెరిగిన సంపద

China - America: అత్యంత సంపన్న దేశంగా అవతరణ * మెకిన్సే గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనంలో వెల్లడి

Update: 2021-11-17 03:41 GMT

అమెరికాను తలదన్నిన చైనా (ఫైల్ ఇమేజ్)

China - America: గత రెండు దశాబ్దాలలో ప్రపంచ సంపద మూడు రెట్లు పెరగ్గా ఇన్నాళ్లూ అగ్రరాజ్యంగా కొనసాగుతున్న అమెరికాను చైనా అధిగమించింది. అంతర్జాతీయ పరిశోధన సంస్థ మెకిన్సే అండ్ కో కన్సల్టెంట్ నివేదిక ప్రకారం 2000లో 156 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ప్రపంచ సంపద 2020 నాటికి 514 ట్రిలియన్ డాలర్లుకు చేరుకుంది. పదికిపైగా దేశాలు ప్రపంచ ఆదాయం కంటే 60 శాతం ఎక్కువ సంపదను కలిగి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ సంపద మూడింతలు కాగా చైనా సంపద అమెరికాను మించి విపరీతంగా పెరిగిందని, నేడు ప్రపంచంలో డ్రాగనే నంబర్‌-1 అని నిర్ధారించారు. ఈ మేరకు మెకిన్సే నివేదికను రూపొందించింది.

ప్రపంచ సంపద పెరుగుదలలో మూడింట ఒక భాగం చైనాదే. ప్రపంచ వాణిజ్య సంస్థ WTOలో చేరడానికి ముందు చైనా సంపద 2000లో కేవలం 7 ట్రిలియన్ల డాలర్ల నుంచి 120 ట్రిలియన్ల డాలర్లకు పెరిగింది. అప్పటి నుంచి చైనా ఆర్థిక ప్రగతి రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఆస్తుల ధరల పెరుగుదలను నిలిపివేయడంతో అమెరికా నికర విలువ రెట్టింపు కంటే ఎక్కువ 90 ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలై అమెరికా, చైనాలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ సంపన్న కుటుంబాలు 10శాతం ఉన్నాయని, వాటా పెరుగుతోందని నివేదిక తెలిపింది. మెకిన్సే ప్రకారం.. ప్రపంచ నికర విలువలో 68శాతం సంపద రియల్ ఎస్టేట్‌లోనే ఉంది. మిగతాది మౌలిక సదుపాయాలు, యంత్రాలు, పరికరాలు, మేధో సంపత్తి, పేటెంట్లు వంటి అసంగతమైన వాటిలో ఉన్నాయి.

Tags:    

Similar News