No Mask in America: అమెరికా ప్రజలకు ఊరట ఇక మాస్క్ ధరించక్కర్లేదు
No Mask in America: కరోనా వైరస్ వ్యాక్సిన్లు తీసుకున్న అమెరికన్లు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు.
No Mask in America: కరోనా వైరస్ వ్యాప్తి చెందిన మొదటి దశలో అల్లాడిపోయిన అమెరికా ప్రజలు ఇక మాస్క్ లను పెట్టుకోనవసరం లేదట. కరోనా వైరస్ వ్యాక్సిన్లు తీసుకున్న అమెరికన్లు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటిం చారు. అయితే జన సందోహాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం మాస్కులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఈ మేరకు గైడ్ లైన్స్ విడుదల చేస్తూ పూర్తిగా (రెండు సార్లు) వ్యాక్సిన్ తీసుకున్నవారు నిరభ్యంతరంగా బయట తిరగవచ్చునని, పాండమిక్ సమయంలో తాము ఆపివేసిన పనులను ఇప్పుడు పూర్తి చేసుకోవచ్చునని పేర్కొంది.
కానీ సినిమా థియేటర్లు, పెద్ద ఈవెంట్లు తదితర భారీ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాత్రం ఇవి ఉండాల్సిందే అని ఈ విభాగం తెలిపింది. వీరంతా రెండో విడత వ్యాక్సిన్ తీసుకున్న రెండు వారాల అనంతరం జల్సా చేయవచ్చునట. అమెరికన్లలో సగానికి పైగా జనాభా ఇప్పటికే వ్యాక్సిన్లు తీసుకున్నారు. అక్కడి ప్రభుత్వం యుధ్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని చేబట్టింది. గత జనవరి 14 న భారీ ఎత్తున ఇనాక్యులేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. రెండు, మూడో విడత వరకు ఇది బాగానే సాగినా ఆ తరువాత మందగించింది. రోజుకు కొన్ని లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తే మే 15 నాటికైనా పరిష్టితి కొంతవరకు అదుపులోకి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో కొత్త కేసుల సంఖ్య చాలావరకు తగ్గడం కూడా ఈ మార్గదర్శక సూత్రాల జారీకి కారణమని తెలుస్తోంది. ఈ నెలారంభం నాటికి 60 వేలకు పైగా కేసులు తగ్గినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ నెల 24 నాటికి జనాభాలో 45 శాతానికి పైగా వ్యాక్సిన్లు తీసుకున్నారు. గత ఏడాది మాత్రం అమెరికా కరోనా వైరస్ కేసులతో తల్లడిల్లింది. ఇండియా నుంచి పెద్దఎత్తున హైడ్రాక్సి మందులు ఆ దేశానికి సరఫరా అయ్యాయి. కొన్ని లక్షల మంది ఈ వైరస్ బారిన పడడంతో అమెరికా ప్రభుత్వ అభ్యర్థనపై ఇండియా ఈ మందులను పంపింది. కానీ ఈ సారి ఇండియాలో సెకండ్ కోవిడ్ వేవ్ కరాళ నృత్యం చేస్తోంది. ఆక్సిజన్ కొరత, ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత తీవ్రంగా ఉంది.