India-Canada Row: భారత్ పై ఆరోపణలు..ఆ సమయంలో మా వద్ద ఆధారాల్లేవ్: ట్రూడో

India-Canada Row: నిఘా సమాచారం ఆధారంగానే భారత్ పై ఆరోపణలు చేశామన్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. ఆ సమయంలో తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని అంగీకరించారు.

Update: 2024-10-17 03:34 GMT

India-Canada Row: భారత్ పై ఆరోపణలు..ఆ సమయంలో మా వద్ద ఆధారాల్లేవ్: ట్రూడో

India-Canada Row: ఖలిస్తానీ ఉగ్రవాది హత్యకేసులో భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ చేసిన ఆరోపణలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని తాను ఆరోపించినప్పుడు, తన వద్ద ఇంటెలిజెన్స్ సమాచారం మాత్రమే ఉందని, 'కఠినమైన ఆధారాలు' లేవని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అంగీకరించారు. ఫెడరల్ ఎన్నికల ప్రక్రియలు, ప్రజాస్వామ్య సంస్థలలో విదేశీ జోక్యంపై బహిరంగ విచారణకు సంబంధించి సాక్ష్యం చెబుతూ ట్రూడో ఇలా అన్నారు. "కెనడా నుండి ఇంటెలిజెన్స్ ఉందని..బహుశా 'ఫైవ్ ఐస్' మిత్రదేశాల నుండి భారత్ ప్రమేయం ఉందని స్పష్టంగా తెలియజేసినట్లు నాకు వివరించింది" అని ట్రూడో చెప్పారు. ఇది తమ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్న విషయమని కెనడా ప్రధాని అన్నారు.

'ఫైవ్ ఐస్' నెట్‌వర్క్ అంటే ఏమిటి?

'ఫైవ్ ఐస్' నెట్‌వర్క్ అనేది అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లతో కూడిన ఐదు దేశాల గూఢచార కూటమి. ట్రూడో మాట్లాడుతూ, నిజానికి భారతదేశం ఇదంతా చేసిందనడానికి నమ్మడానికి మాకు కారణం ఉంది" అని ట్రూడో తన ప్రభుత్వ విధానం దీనిపై భారత ప్రభుత్వంతో కలిసి పని చేయడం అని అన్నారు.

గత ఏడాది సెప్టెంబరులో జరిగిన G-20 శిఖరాగ్ర సమావేశాన్ని గుర్తుచేసుకుంటూ, ట్రూడో భారతదేశానికి ఇది ఒక పెద్ద అవకాశమని, ఆ సమయంలో కెనడా ఈ ఆరోపణలను బహిరంగంగా చేసి ఉంటే, అది "ఈ శిఖరాగ్ర సమావేశంలో భారతదేశానికి చాలా అసౌకర్య పరిస్థితిని కలిగించేది" అన్నారు. మేము అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ముందుగానే నిర్ణయించుకున్నాము.. కానీ అసలు నిజ్జర్ హత్యకేసు విషయాన్ని తెరవెనక చేయాలని నిర్ణయించాము. ఇలా చేస్తే భారత తప్పకుండా తమకు సహకరిస్తుందని అనుకున్నాము. ఆ సమయంలో భారత్ సాక్ష్యాలను అడిగింది...మేము ఆధారాలన్నీ నిఘా సంస్థల వద్ద ఉన్నాయని తెలిపాము అని ట్రూడో చెప్పుకొచ్చారు.

అయితే తమను విమర్శించే ధోరణి భారత్ అవలంభిస్తోందన్న విషయం జీ20 నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత తమకు అర్థమైందని ట్రూడో చెప్పారు. ఇక కెనడియన్లకు సంబంధించిన సమాచారాన్ని భారత దౌత్యవేత్తలు సేకరించారని..వాటిని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు అందించారంటూ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.

Tags:    

Similar News