Canada Police : కెనడాలో ఆందోళన చేస్తోన్న హిందువుపై పోలీసు దాడి.. వీడియో వైరల్

Update: 2024-11-04 06:59 GMT

Canada Police Attacking Hindu Man : కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయంపై ఖలిస్తానీ వేర్పాటు వాదాలు దాడిని నిరసిస్తూ హిందువులు ఆందోళనకు దిగారు. స్థానికంగా ఉన్న హిందువులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. భారత జాతీయ జండా పట్టుకుని హిందువులపై దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తంచేశారు.

హిందువుల ధర్నా నేపథ్యంలో అసాంఘీక శక్తులు చెలరేగిపోకుండా ఉండేందుకు భారీ సంఖ్యలో పోలీసులను సైతం మొహరించారు. ఈ క్రమంలోనే అక్కడున్న పోలీసులలో ఒకరు ఆందోళన చేస్తోన్న వారిలోకి దూసుకెళ్లి ఒక హిందూ ఆందోళనకారుడిపై దాడికి పాల్పడ్డారు. దీంతో కాసేపు అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వెంటనే మిగతా పోలీసులు ఆ సమూహంలోకి వెళ్లి ఆ పోలీసులు బయటికి లాక్కొచ్చారు. ఈ దృశ్యాలని డానియెల్ బార్డ్‌మన్ అనే జర్నలిస్ట్ ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

సదరు పోలీసు ఆఫీసర్ హిందూ ఆందోళనకారుడి ముఖంపై పిడిగుద్దులు గుప్పించి ఆయన్ని తోసేస్తూ దాడికి పాల్పడినట్లు ఈ వీడియోను షేర్ చేసిన డానియెల్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు ఆందోళనకారులలో ఒక మహిళ ఆ పోలీసు వైపే వేలెత్తి చూపిస్తూ అతనే దాడికి పాల్పడ్డారు అని ఆరోపించడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆయన్ని ఇక్కడ నుండి బయటకు తీసుకెళ్లండి అని గట్టిగా అరుస్తుండటం ఆ వీడియోలో చూడొచ్చు.

Tags:    

Similar News