Whiskey: వామ్మో.. ఆ విస్కీ బాటిల్‌కి అంత రేటా..?

* 'మందు బాబులం.. మ‌నం మందు బాబులం.. మందు కొడితే మ‌న‌కు మ‌నం మ‌హారాజులం' అన్న‌ట్టుంది ఎవ్వారం.

Update: 2021-10-21 13:00 GMT

Whiskey: వామ్మో.. ఆ విస్కీ బాటిల్‌కి అంత రేటా..?(ఫోటో: ది స్పిరిట్స్ బిజినెస్)

Whiskey Bottle: 'మందు బాబులం.. మ‌నం మందు బాబులం.. మందు కొడితే మ‌న‌కు మ‌నం మ‌హారాజులం' అన్న‌ట్టుంది ఎవ్వారం. మందుబాబుల‌కు న‌చ్చాలే కానీ ఏదైనా చేస్తారు.. ఎంత‌కైనా తెగిస్తారు.. ఎందుకంటే ఓ సంస్థ ప్ర‌తినిధులు ఏకంగా ఒక విస్కీ బాటిల్‌కి రూ.39 ల‌క్ష‌లు పెట్టి కొనుగోలు చేశారు. ఇది న‌మ్మ‌శ‌క్యంగా లేకున్నా ఇది నిజం. నచ్చిన బ్రాండ్ కోసం ఆస్తులు అమ్ముకొనైనా స‌రే దానిని ద‌క్కించుకుంటారు. మందుబాబుల ధృడ సంక‌ల్పం అలాంటిది మ‌రీ.. ఆ విస్కీ బాటిల్ ఏంటి దాని ధ‌ర ఏంటి అస‌లు విష‌యం ఏంటి మొత్తం వివ‌రాలు తెలుసుకుందాం.

స్కాట్లాండ్‌కు చెందిన 72ఏళ్ల నాటి గ్లెన్‌గ్రాంట్ సింగిల్మాల్ట్ అనే విస్కీ బాటిల్‌ పై హాంకాంగ్ లో వేలంపాట జరిగింది. 1948 గ్లెన్ గ్రాంట్ డిస్టిలరీ అనే కంపెనీ తయారు చేసిన విస్కీ బాటిల్‌ను రూ.39లక్షలు పెట్టి దక్కించుకున్నట్లు ఆ విస్కీ బాటిల్‌ను వేలం వేసిన బోన్హామ్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇదే వేలం పాటలో జపాన్ కు చెందిన 35ఏళ్ల నాటి హిబ్కీ విస్కీ బాటిల్ ను వేలం వేయగా ఓ మందు బాబు రూ.35లక్షలు పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విస్కీ స్పెషలిస్ట్ క్రిస్టోఫర్ ఫాంగ్ మాట్లాడుతూ.. గత పదేళ్ల నుంచి మద్యం కొనుగోళ్ల విషయంలో ఔత్సాహికులు ఖర్చుకు వెనక్కి తగ్గడం లేదన్నారు.

అయితే ఈ విష‌యంపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఒక్క విస్కీ బాటిల్ కోసం అంత ఖ‌ర్చు ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మందుబాబులు మ‌రీ రెచ్చిపోతున్నార‌ని ఆగ్ర‌హిస్తున్నారు. మ‌రికొంద‌రైతే విస్కీ బాటిల్‌ని వేలం వేసిన కంపెనీ పై మండిప‌డుతున్నారు. కరోనా క్రైసిస్‌లో కూడా మద్యం బాటిల్ ధర విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. మందుకున్న క్రేజ్ అలాంటిదని మందుబాబులు చెప్పకనే చెప్పారు.

Tags:    

Similar News