బ్రిటిష్ ప్రధానికి మళ్ళీ కరోనా!
ఓ పార్లమెంట్ సభ్యుడికి కరోనా సోకడంతో అయన బోరిస్ జాన్సన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోయారు. అయితే తాజాగా ఆయనకి నిర్వహించిన కరోనా పరీక్షల్లో కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది.
బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఓ పార్లమెంట్ సభ్యుడికి కరోనా సోకడంతో అయన బోరిస్ జాన్సన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోయారు. అయితే తాజాగా ఆయనకి నిర్వహించిన కరోనా పరీక్షల్లో కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది. నవంబర్ 26 వరకు అయన పాలన కార్యక్రమాలను ఇంటినుంచే చూస్తారని అధికారులు వెల్లడించారు. అయితే తనకి కరోనా సోకినప్పటికి లక్షణాలు ఏమీ కనిపించలేదని అన్నారు బోరిస్.. అటు ఈ ఏడాది ఏప్రిల్ లో మొదటిసారి అయన కరోనా బారిన పడ్డారు. కరోనా సోకిన తర్వాత తన పరిస్థితి తీవ్రం కావడంతో ఐసీయూలో చికిత్స అందించారు. ఆ తరవాత అయన కరోనా నుంచి కోలుకున్నారు.
కరోనాకి ఏడాది పూర్తి :
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వెలుగుచూసి నేటితో ఏడాది పూర్తయ్యింది. దాదాపు ఒక్క ఏడాదిలోనే 219 దేశాలకు ఈ వైరస్ విస్తరించింది. కంటికి కనిపించకుండా ప్రపంచాన్ని గడగడలాడించి, అన్ని వర్గాల వారిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తోన్న ఈ వైరస్ బయటపడి.. ఏడాది పూర్తవుతోంది. ఇది కచ్చితంగా ఎప్పుడు బయటపడిందనే దానిపై మాత్రం భిన్నాభిప్రాయాలున్నాయి.
వుహాన్‌లో ఈ ఏడాది జనవరిలో కరోనా మహమ్మారి తీవ్రత వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కి పడ్డాయి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అన్ని దేశాలకు ఈ వైరస్ పాకింది. కరోనా కట్టడికి పలు దేశాలు లాక్‌డౌన్ ఆంక్షలు విధించాయి. ఇప్పటి వరకు 5.50 కోట్ల మందికి ఈ వైరస్ సోకినట్లు సమాచారం. 2019లో కరోనా బారిన పడిన 266 మందిని చైనా గుర్తించింది. వీరందరూ చికిత్స పొందారు. తర్వాత యావత్ ప్రపంచం కరోనా పరిణామాలను అనుభవించాల్సి వచ్చింది.