Britain: ఆగస్టు నాటికి కరోనా ఫ్రీ కంట్రీగా బ్రిటన్‌

Britain: ఆగస్టు నాటికి బ్రిటన్ లో కరోనా వైరస్ అంతమైపోతుందని ఆ దేశ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్‌గా రిటైరవుతున్న క్లైవ్ డిక్స్ చెప్పారు.

Update: 2021-05-09 07:10 GMT

Britain: ఆగస్టు నాటికి కరోనా ఫ్రీ కంట్రీగా బ్రిటన్‌

Britain: ఆగస్టు నాటికి బ్రిటన్ లో కరోనా వైరస్ అంతమైపోతుందని ఆ దేశ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్‌గా రిటైరవుతున్న క్లైవ్ డిక్స్ చెప్పారు. 2022 తొలి మాసాల్లో వ్యాక్సిన్ బూస్టర్ ప్రోగ్రాంను బ్రిటన్‌ ప్రభుత్వం చేపట్టబోతోంది. వచ్చే జూలై చివరిలోగా బ్రిటన్‌ ప్రజలకు కనీసం ఒక్క డోసు వ్యాక్సినేషన్‌ను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు బ్రిటన్‌లో 5 కోట్లకు పైగా టీకాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే సగం మంది వయోజనులకు మొదటి డోసు ఇచ్చిన రెండవ దేశంగా బ్రిటన్ రికార్డు సృష్టించింది. రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉన్నందున 40 ఏళ్లలోపు వారికి ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌కు ప్రత్యామ్నాయ వ్యాక్సిన్‌ను అందించనున్నట్లు బ్రిటిష్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఫైజర్, మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్ల వైపు అధికారులు మొగ్గు చూపుతున్నారు.

Tags:    

Similar News